రాజకీయం సంక్షోభం, దేశంలో అస్తవ్యస్తమైన ఆర్ధిక పరిస్ధితుల నేపథ్యంలో బ్రిటన్( Britan ) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు రిషి సునాక్.తద్వారా ఈ అత్యున్నత పదవిని అధిరోహించిన తొలి భారత సంతతి వ్యక్తిగా, తొలి దక్షిణాది వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.
అప్పటి నుంచి దేశాన్ని గాడిలో పెట్టేందుకు రిషి సునాక్( Rishi Sunak ) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు .ముఖ్యంగా దేశానికి గుదిబండలా మారిన వలసలను నియంత్రించేందుకు ఆయన కఠిన చర్యలు కూడా తీసుకున్నారు.ఈసారి రిషి సునాక్ నేతృత్వంలో కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికలకు వెళ్లనుంది.దీంతో రానున్న రోజుల్లో తన రాజకీయ చతురతతో పాటు పాలనా దక్షతను రిషి నిరూపించుకోవాల్సి వుంది.
ఇదిలావుండగా.బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III ( King Charles III )మంగళవారం బ్రిటన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.దాదాపు 70 ఏళ్ల తర్వాత రాజు .యూకే పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి.ఈ సందర్భంగా ఎన్నికల ముంగిట కీలక అంశాలను ఆయన ప్రసంగంలో చేర్చింది సునాక్ ప్రభుత్వం.2010 నుంచి బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీయే అధికారంలో వుంది.గతేడాది మేలో తన తల్లి క్వీన్ ఎలిజబెత్ 2 కాలం చేయడంతో బ్రిటన్ మహారాజుగా కింగ్ చార్లెస్ III పగ్గాలు అందుకున్న సంగతి తెలిసిందే.రాణి మరణానికి కేవలం రెండు రోజుల ముందే లిజ్ ట్రస్( Liz Truss ) నుంచి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రిషి సునాక్.
ఆమె కేవలం 49 రోజులు మాత్రమే పదవిలో కొనసాగారు.
పర్యావరణం, ఎనర్జీలపై కీర్ స్టార్మర్ సారథ్యంలోని లేబర్ పార్టీ వ్యూహాలకు చెక్ పెట్టేలా రిషి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఉత్తర సముద్రంలో చమురు, గ్యాస్ ప్రాజెక్ట్‌లకు ( oil , gas projects )ఏటా కొత్త లైసెన్స్‌లను మంజూరు చేసే చట్టాన్ని ఆయన ప్రతిపాదిస్తున్నారు.ఇది విదేశీ శక్తిపై బ్రిటన్ ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు ఉద్యోగాలను సృష్టిస్తుందని రిషి సునాక్ వెల్లడించారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్రీన్ ఎనర్జీ విధానాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.లేబర్ పార్టీ విషయానికి వస్తే.కొత్తగా చమురు, గ్యాస్ అన్వేషణకు లైసెన్సులు ఇవ్వబోమని , గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులను పెంచుతామని హామీ ఇచ్చింది.