టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి హస్తిన బాట పట్టనున్నారు.ఈ మేరకు ఇవాళ లోకేశ్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఈ క్రమంలో ముందుగా రాజమండ్రి నుంచి గన్నవరం చేరుకోనున్న నారా లోకేశ్ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఎల్లుండి విచారణ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో న్యాయవాదులకు అందుబాటులో ఉండేందుకు గానూ లోకేశ్ ఢిల్లీకి పయనం అవుతున్నారని తెలుస్తోంది.సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ పరిణామాలపై టీడీపీ ముఖ్యనేతలు, సీనియర్ న్యాయవాదులతో లోకేశ్ ఇవాళ, రేపు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.
కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.