టీడీపీ( TDP )లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఎవరి అంచనాలు అందడం లేదు.స్కిల్ స్కామ్ లో చంద్రబాబు ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నారు.
ఇంకా పలు కేసులు ఆయనను చుట్టుముడుతూనే ఉన్నాయి.అటు నారా లోకేశ్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది.
రింగ్ రోడ్ స్కామ్( Ring Road Scam ) లో ఏ 14 గా ఉన్న లోకేశ్ ను పరిగణించిన సిఐడి ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఏపీ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది.షెడ్యూల్ ప్రకారం రేపు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టాల్సి ఉంది.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన పాదయాత్ర స్టార్ట్ చేయడం కష్టమే అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నారా లోకేశ్( Nara Lokesh ) వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఒకవేళ తను అరెస్ట్ అయితే తన స్థానంలో ఆయన సతీమణి నారా బ్రహ్మణి పాదయాత్ర చేసేలా లోకేశ్ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.చంద్రబాబు అరెస్ట్ తరువాత నారా భువనేశ్వరి మరియు నారా బ్రహ్మణి నిరసనలు చేస్తూ రాజకీయాల్లో చురుకుగా కనిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో లోకేశ్ అరెస్ట్ అయితే నారా బ్రహ్మణి పాదయాత్ర( Nara Brahmani Padayatra ) చేయడం వల్ల టీడీపీకి తిరుగులేని మైలేజ్ వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట.ఇప్పటికే బ్రహ్మణి పాదయాత్రకు సంబందించి అన్నీ విషయాలు కూడా చర్చించినట్లు టాక్.
బ్రహ్మణి కూడా పాదయాత్ర చేసేందుకూ ఆసక్తిగానే ఉన్నారట.దీంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బ్రహ్మణి పార్టీకి అండగా మారడం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందనేది కొందరి అభిప్రాయం.గతంలో వైఎస్ జగన్( YS జైల్లో ఉన్నప్పుడూ ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల పాదయాత్ర( YS Sharmila Padayatra ) చేసి వైసీపీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.ఇప్పుడు అదే విధంగా టీడీపీ కష్టకాల సమయంలో నారా బ్రహ్మణి పాదయాత్ర టీడీపీకి కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారట.
మరి మొత్తానికి టీడీపీని ముందుండి నడిపించే బాద్యతను నారా బ్రహ్మణి తీసుకున్నట్లు తెలుస్తోంది.