ఏపీ రాజకీయాలు క్షణ క్షణం ఉత్కంఠను రేపుతున్నాయి.ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టంగా మారింది.
ఎన్నికలకు కేవలం ఎనిమిది నెలలు సమయం ఉండగానే గెలుపే లక్ష్యంగా ఉన్న చంద్రబాబు( Chandrababu ) అనూహ్యంగా స్కిల్ స్కామ్ లో ఇరుక్కున్నారు.ఇప్పటికే ఆయన జైల్లో ఉండి 15 రోజులు దాటుతోంది.
బెయిల్ కోసం టీడీపీ లాయర్లు శతవిధాల ప్రయత్నిస్తున్నప్పటికి బెయిల్ ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి.మరోవైపు నారా లోకేశ్( Nara Lokesh ) కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమరావతి రింగ్ రోడ్డులో లోకేశ్ స్కామ్ కు పాల్పడ్డారని సీఐడీ ఆరోపిస్తూ ఇటీవల ఆయనను ఏ14 గా లిస్ట్ లో పేరు చేర్చింది.దీంతో లోకేశ్ ను కూడా ఏ క్షణంలోనైనా కస్టడీకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
![Telugu Chandrababu, Cm Jagan, Lokesh, Ys Jagan-Politics Telugu Chandrababu, Cm Jagan, Lokesh, Ys Jagan-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/CM-jagan-tdp-YCP-party-Chandrababu-Nara-Lokesh-politics.jpg)
దీంతో టీడీపీ భవిష్యత్ కార్యక్రమాల పట్ల అనిశ్చితి ఏర్పడింది.అధినేతలను స్కామ్ లు చుట్టుముట్టడంతో ఎలా ముందుకు సాగాలనే దానిపై టీడీపీ శ్రేణులూ సంధిగ్డంలో పడ్డారట.దాంతో మొన్నటి వరకు యమ దూకుడు ప్రదర్శించిన టీడీపీ( TDP ) ప్రస్తుతం డౌన్ గేర్ లో పడిపోయింది. టీడీపీ పరిస్థితి ఎలా ఉంటే అటు జగన్ మాత్రం టాప్ గేర్ లో దూసుకుపోయెందుకు వ్యూహాలను రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల పార్టీ నేతలతో ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, రీజినల్ కొ ఆర్డినేటర్లతో భేటీ అయిన ఆయన భవిష్యత్ కార్యాచరణ విషయంలో దిశ నిర్దేశం చేశారాట.
![Telugu Chandrababu, Cm Jagan, Lokesh, Ys Jagan-Politics Telugu Chandrababu, Cm Jagan, Lokesh, Ys Jagan-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/CM-jagan-tdp-YCP-party-Chandrababu-Nara-Lokesh.jpg)
ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ఇకపై పక్కగా అందరూ ప్రజల్లో ఉండాలని కీలక సూచనలు చేశారట.ఇప్పటివరకు ఎలాగున్నా ఇకపై మాత్రం ప్రతి నేత ప్రజల్లో ఉండాలని జగన్( CM jagan ) గట్టిగా నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది.ఎందుకంటే ఓ వైపు టీడీపీని స్కామ్ లు వెండడుతున్న వేళ ఆ పార్టీపై ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బ తీసేందుకు ఇదే సరైన సమయమని, ఈ సందర్భాన్ని కరెక్ట్ గా యూస్ చేసుకొని ఎన్నికల్లో విజయ ఢంఖా మోగించాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
మరి జగన్ టాప్ గేర్ దూసుకుపోయెందుకు అన్నీ విధాలుగా రెడీ అయ్యారనే చెప్పాలి.