ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో మహిళలను విచారించే అంశంపై ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
మహిళల ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో పలువురు నేతలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.సీఆర్పీసీ సెక్షన్ 160ని దర్యాప్తు సంస్థలు ఉల్లంఘిస్తున్నారని నళిని చిదంబరం, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, ఎమ్మెల్సీ కవిత పిటిషన్ వేశారు.
ఈ మేరకు మహిళలను ఇంటి వద్దే విచారించే విధంగా న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు.కాగా మద్యం కుంభకోణంలో కవితకు మళ్లీ నోటీసులు ఇవ్వడంపై రేపు స్పష్టత రానుంది.