ఒక ఊరు చాలా చిత్ర విచిత్రంగా వుంటుంది.ఆ ఊర్లో నడిచేటప్పుడు ఆచి తూచి అడుగులు వేయకపోతే ఇక అంతే, గుంతల్లో పడిపోతారు.
అదేవిధంగా మనం వేసే అడుగులు ఏ ఇంటి పైకప్పు మీదనో.ఏ హోటల్ టాప్ మీద వేస్తామో ఓ పట్టాన మనకి అర్ధం కాదు కూడా.
కాస్త పరిశీలించి చూస్తేగానీ మనం నడిచేది ఎక్కడో మనకి అర్థం కాని పరిస్థితి.ఎందుకంటే ఆ ఊళ్లో ఇళ్లు, హోటల్స్ ఆఖరికి ప్రార్ధనా మందిరాలు, షాపులు అన్నీ గుట్టల్లోనే ఉంటాయి కాబట్టి.
ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ అన్నీ భూగర్భంలోనే కొలువుదీరి వుంటాయి.
అంతేకాదండోయ్, ఆ గ్రామంలో రత్నాల గనులు( Gem Mines ) కోకొల్లలుగా ఉంటాయి.
అందుకే ఈ ఊరు ‘ఓపల్ కేపిటల్ ఆఫ్ ద వరల్డ్’గా( Opal Capital of the World ) పేర్కొంటారు.ఇక్కడ అత్యంత విలువైన ‘ఓపల్’ రత్నాలు విరివిగా దొరుకుతాయి.
రంగు రంగులతో మెరిసిపోయే రత్నాల గనులకు ప్రసిద్ది చెందింది.ఈ గ్రామాన్ని కాస్త దూరం నుంచి చూస్తే అసలు వూరన్న సంగతి ఎవరికీ అర్ధం కాదు.
అన్నీ గుట్టల్లే కనిపిస్తాయి.దగ్గరకెళ్లి పరిశీలించి చూస్తే ఒక్కో గుట్టలో ఒక్కో ఇల్లు కనిపిస్తుంది.
ఈ గ్రామంలో అడుగడుగునా గోతులు ఉంటాయి.గోతులు ఉన్నట్లుగా వార్నింగ్ బోర్డులు మాత్రం కనిపిస్తాయి.
![Telugu Australia, Coober Pedy, Gem, Opal, Opal Gems-Latest News - Telugu Telugu Australia, Coober Pedy, Gem, Opal, Opal Gems-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/09/Opal-Capital-of-the-World-coober-pedy-underground-houses-opal-mines-detailss.jpg)
కాగా కొత్తవారికి ఈ బోర్డులు సహకరిస్తాయి.ఇంతకీ ఆ ఊరు ఎక్కడ వుందంటే, దక్షిణ ఆస్ట్రేలియాలో( South Australia ) అడిలాయిడ్ నగరానికి 846 కిలోమీటర్ల దూరంలో వుంది.ఈ వింత ఊరు పేరు ‘కూబర్ పెడీ’(Coober Pedy).గ్రామ జనాభా దాదాపు 2,5000.పాతాళ గృహాలకు ఈ ఊరు పరుగాంచింది.ఓపల్ గనులు ఉండే ఈ గ్రామం ‘ఓపల్ కేపిటల్ ఆఫ్ ద వరల్డ్’గా రికార్డుల్లోకి ఎక్కింది.
ఇక్కడ అత్యంత విలువైన ‘ఓపల్’ రత్నాలు దొరుకుతాయి.
![Telugu Australia, Coober Pedy, Gem, Opal, Opal Gems-Latest News - Telugu Telugu Australia, Coober Pedy, Gem, Opal, Opal Gems-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/09/Opal-Capital-of-the-World-coober-pedy-underground-houses-opal-mines-detailsd.jpg)
ఈ ఓపల్ రత్నాలకు( Opal Gems ) ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.ఈ ఊరి పరిధిలో దాదాపు డెబ్భైకి పైగా ఓపల్ గనులు ఉన్నాయి.ఈ ఊరు భూగర్భంలో ఉండటానికో కారణం కూడా ఉందని చెబుతూ వుంటారు.
వేసవిలో ఇక్కడి వేడి విపరీతంగా ఉంటుంది.ఆ వేడి తట్టుకోవటం చాలా కష్టం.
వేసవిలో 50 నుంచి 113 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంటాయి.ఈ ఎండల వేడిని తట్టుకుని, బతికి ఉండాలంటే ఇలా నివాసాలన్నీ భూగర్భంలో ఉండాల్సిందే.
అందుకే ఆ గ్రామం అంతా భూగర్భంలోనే ఉంటుంది.