మంత్రి జగదీష్ రెడ్డి సమయస్పూర్తి...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమయస్పూర్తి న్యాయ మూర్తి ప్రాణాలను నిలబెట్టింది.సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద రాత్రి 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది.

 Minister Jagadish Reddy Helps Ap High Court Advocate Sujatha Injured In Road Acc-TeluguStop.com

ప్రమాదంలో న్యాయమూర్తి సుజాత తీవ్రంగా గాయపడింది.దీంతో పోలీసులు ప్రథమ చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఆ సమయం లో తిరుమలగిరి లో ఓ శుభకార్యానికి హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి చేరుకుని సుజాత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.మెరుగైన చికిత్స అవసరం ఉందని వైద్యులు చెప్పడంతో వెంటనే మూడు జిల్లాల ఎస్పీలని అలెర్ట్ చేసి, సూర్యాపేట నుండి హైదరాబాద్ వరకు జాతీయ రహదారిపై ఉన్న పోలీసు స్టేషన్ సిబ్బందిని ట్రాఫిక్ క్లియరెన్స్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు.

ఓ వైపు జోరున వర్షం కురుస్తుండటంతో ఇబ్బందులు తలెత్తకుండా సుజాతని తరలించే అంబులెన్స్ ను

తన కాన్వాయ్ మధ్యలో ఉంచి రక్షణగా హైదరాబాద్ కు తరలించారు.మంత్రి సమయస్పూర్తితో కేవలం గంట పదిహేను నిమిషాలలో సుజాతని హైదరాబాద్ తరలించారు.

ప్రస్తుతం న్యాయ మూర్తి సుజాతకి ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.సకాలంలో సుజాతను హైదరాబాద్ తరలించడం మంచి పరిణామమని వైద్యులు తెలిపారు.

న్యాయవాదిగా న్యాయమూర్తిని సకాలంలో సుజాతను హైదరబాద్ కు తరలించిన మంత్రి జగదీష్ రెడ్డి సమయస్పూర్తిని న్యాయవాదులు,ప్రజలు కొనియాడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube