భారత్-ఐర్లాండ్( India-Ireland ) ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఆడిన రెండు మ్యాచ్లలోనూ భారత్ విజయం సాధించి, మరో మ్యాచ్ ఆడాల్సి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది.అయితే నేడు జరిగే మూడవ టీ20 మ్యాచ్( T20 match ) లో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు భావిస్తోంది.
మరొకపక్క చివరి మ్యాచ్లో గెలిచి తమ పరువు నిలుపుకోవాలని ఐర్లాండ్ పట్టుదలతో ఉంది.
![Telugu Duckworth Lewis, India, Latest Telugu, Rinku Singh, Rituraj Gaikwad, Sanj Telugu Duckworth Lewis, India, Latest Telugu, Rinku Singh, Rituraj Gaikwad, Sanj](https://telugustop.com/wp-content/uploads/2023/08/India-Ireland-T20-match-today-Will-India-make-a-clean-sweepb.jpg)
ఈ సిరీస్ తొలి మ్యాచ్లో భారత జట్టు కాస్త తడబడింది.భారత బౌలర్లు రాణించడం తో ఐర్లాండ్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది.భారత బ్యాటర్లు చేజింగ్ మొదలుపెట్టిన కాసేపటికి వర్షం రావడం, ఎంతసేపైనా వర్షం తగ్గకపోవడం వల్ల డక్ వర్త్ లూయిస్( Duckworth Lewis ) పద్ధతిలో అంపైర్లు భారత జట్టును విజేతగా ప్రకటించారు.
ఈ సిరీస్ రెండో మ్యాచ్లో భారత జట్టు బ్యాటర్లు అద్భుత ఆటను ప్రదర్శించారు.భారత జట్టు ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్( Rituraj Gaikwad ) అర్థ సెంచరీ చేయగా.
సంజూ శాంసన్, రింకూ సింగ్( Sanju Samson, Rinku Singh ) కూడా ధాటిగా ఆడారు.దీంతో భారత జట్టు మంచి స్కోర్ చేయగలిగింది.అనంతరం ఐర్లాండ్ చేజింగ్లో భారత జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించడంతో 33 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
![Telugu Duckworth Lewis, India, Latest Telugu, Rinku Singh, Rituraj Gaikwad, Sanj Telugu Duckworth Lewis, India, Latest Telugu, Rinku Singh, Rituraj Gaikwad, Sanj](https://telugustop.com/wp-content/uploads/2023/08/India-Ireland-T20-match-today-Will-India-make-a-clean-sweepc.jpg)
ఈ సిరీస్ మూడవ మ్యాచ్ నేడు డబ్లిన్ వేదికగా జరుగుతోంది.ఈ డబ్లిన్ పిచ్ బ్యాటింగ్ కు బాగా సహకరిస్తుంది.మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ నెమ్మదిగా మారే అవకాశం ఉంది.
కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరు నమోదు చేయడం ఖాయం.
కాబట్టి మొదట బ్యాటింగ్ చేసే జట్టు గెలిచే అవకాశాలే చాలా ఎక్కువ.ఇక భారత జట్టు ఈ మ్యాచ్లో గెలిచి క్లీన్ స్వీప్ చేస్తుందా.
లేదంటే ఐర్లాండ్ ఈ మ్యాచ్ లో గెలిచి పరువు కాపాడుకుంటుందా అనేది చూడాల్సి ఉంది.మొత్తానికి ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంది.