ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య( vaishnavi chaitanya ) పేరు ఎక్కువగా వినిపిస్తోంది.మొన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీ లీల పేరు ఎక్కువగా వినిపించగా ఇప్పుడు వైష్ణవి చైతన్య పేరు ఎక్కువగా మారుమోగుతోంది.
బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య నటనకు ప్రేక్షకులు యూత్ ఫిదా అయ్యారు.సినిమాలో నటనకు గాను విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
భవిష్యత్ లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లాలి అని కొందరు కామెంట్స్ చేస్తుండగా మరికొందరు తప్పకుండా వెళుతుంది అంటూ ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ సినిమా ఒక రకంగా సక్సెస్ అయ్యింది వైష్ణవి చైతన్య వల్లే అంటున్నారు అభిమానులు.
ఆమెలో మంచి నటి దాగి ఉంది.భవిష్యత్ లో తెలుగు ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు తెచ్చుకుంటుందని అంటున్నారు.బేబీ మూవీ 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించి బాక్సాఫీస్ షేక్ చేస్తుంది.దీంతో టాలీవుడ్ దర్శక, నిర్మాతల చూపు వైష్ణవి చైతన్యపై పడిందని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన తదుపరి చిత్రంలో వైష్ణవిని తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు బాలీవుడ్ కి వెళ్లడంతో అప్ కమింగ్ హీరోయిన్లకు మంచి ఛాన్సులు వచ్చాయి.
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కించిన పెళ్లిసందD మూవీతో హీరోయిన్ పరిచయం అయ్యింది శ్రీలీల.ఈ సినిమాల తర్వాత శ్రీలీలకు వరుస ఆఫర్లు రావడం.అవి కూడా మంచి సక్సెస్ సాధించడంతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.ప్రస్తుతం ఉస్తాత్ భగత్ సింగ్, భగవత్ కేసరి, గుంటూరు కారం, స్కంద, ఎక్స్ట్రా,.
ఆది కేశవ లాంటి పెద్ద సినిమాల్లో ఇస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది.
అంతేకాదు ఈ మద్యనే విజయ్ దేవరకొండతో మరో పాన్ ఇండియా మూవీ చేయడానికి ఒప్పుకుందని ఇండస్ట్రీ టాక్.ఈ మూవీస్ కనుక హిట్ అయితే కొంతకాలం పాటు శ్రీ లీల ఇండస్ట్రీని ఏలేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.మరోవైపు బేబీ మూవీతో భారీ కలెక్షన్లు రాబట్టి బెస్ట్ హీరోయిన్ అనిపించుకున్న వైష్ణవి చైతన్య క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ప్రస్తుతం శ్రీలీలను( Sreeleela ) సైతం బీట్ చేసే రేంజ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంటోది వైష్ణవి.ఇప్పటికే ఈ అమ్మడి చేతిలో దాదాపు 6 సినిమాలు ఉన్నాయని సమాచారం.
ఈ సినిమాలకు సంబంధించిన అఫిషియల్ టాక్ త్వరలో రాబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్.ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీస్ లో ముందుగా శ్రీలీల అనుకున్నప్పటికీ ఇప్పుడు వైష్ణవి చైతన్యను ఒకే చేసిన సినిమాలు కూడా ఉన్నాయని సమాచారం.
ఎంతో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీ లీల వర్సెస్ వైష్ణవి చైతన్య అన్నట్టుగా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని తెలుస్తోంది.