బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా 9 Urvasi Rautela )ఈ మధ్య టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ భామ వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది.
ఈమె ముందుగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఇక్కడ పరిచయం అయ్యింది.ఈ సాంగ్ తర్వాత ఈమెకు ఇక్కడ వరుస అవకాశాలు వస్తున్నాయి.
మరో మెగా మల్టీస్టారర్ లో ఈ అమ్మడి అవకాశం అందుకుంది.ఇద్దరు మెగా హీరోలతో అమ్మడు ఆడిపాడింది.
సాయి తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ‘బ్రో’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసింది.పవన్, తేజ్ ఇద్దరు కలిసి మాస్ బీట్ సాంగ్ లో కనిపించగా అమ్మడు కూడా స్టెప్పులు వేసి సర్ప్రైజ్ ఇచ్చింది.ఈ సాంగ్ ను నిన్న మేకర్స్ అఫిషియల్ గా రిలీజ్ చేసారు
సాయి తేజ్, పవన్, ఊర్వశి కనిపించిన ఈ సాంగ్ ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకుంది.ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది.ఈ అమ్మడు బ్రో ( Bro Movie )ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు పవన్ కళ్యాణ్, సాయి తేజ్ తో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేసింది.
ఈ పిక్ ను షేర్ చేస్తూ ”గౌరవనీయులైన ఏపీ సీఎం(AP cm ) పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉందంటూ” ఈమె చేసిన ట్వీట్ పై పలువురు నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.జనరల్ నాలెడ్జ్ కనీసం లేకుండా ఎలా ట్వీట్ చేస్తారు అంటూ అమ్మడిపై ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈమె చేసిన పోస్ట్ పై ఈ భామ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.