సినిమా( Movie ) అంటేనే రంగురంగుల ప్రపంచం.షూటింగ్ స్పాట్లో చాలా హడావుడిగా నటీనటులు, టెక్నీషియన్లు పనిచేస్తూ వుంటారు.
వారికి ఒక్క క్షణం కూడా చాలా ఇంపార్టెంట్.అలాంటి హడావుడిలో అక్కడ ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఇంతలో అక్కడ ఓ హఠాత్పరిణామం జరిగింది.దాంతో అందరూ ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు పెట్టారు.
ఈ ఘటన ముంబైలో( Mumbai ) జరిగినట్టు తెలుస్తోంది.గోరేగావ్ ఫిల్మ్ సిటీలో టీవీ సీరియల్ షూటింగ్ ఒకటి జరుగుతుంది.
అయితే అది ఏ సీరియల్ అనే విషయం ఇంకా తెలియదు.దాదాపుగా 200 మంది సిబ్బంది ఉన్న సెట్‌లోకి ఒక్కసారిగా పులి( Tiger ) ఎంట్రీ ఇవ్వడంతో.
నటులతో పాటు టెక్నీషియన్స్, సిబ్బంది సెట్ నుంచి బయటకు పరారయ్యారు.

ఇక ఈ అంశమై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామ్లాల్ గుప్తా ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ.గత పది రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది నాలుగోసారి అని తేల్చి తెలిపారు.దాంతో వారికి ప్రభుత్వం సాయం చేయాలని, తొందరగా చర్యలు చేపట్టాలని విన్నవించారు.
తరచూ ఇలా పులులు వస్తుండటంతో షూటింగ్స్ ఆగిపోయి రోజుకు లక్షల్లో నష్టం వస్తుందని వాపోతున్నారు.మరోవైపు సెట్స్ లోకి వచ్చిన చిరుతలు నటీనటులకు ఎలాంటి అపాయం తలపెడయోనని జనాలు ఆందోళన చెందుతున్నారు.
ఫలితంగా పులి భయానికి టెక్నీషియన్స్, డైలీ వర్కర్స్ పనిలోకి రావడానికి భయపడుతున్నారు అని ఆయన మీడియా ముందు వాపోయాడు.

కాగా… తాజాగా జరిగిన ఆ దృశ్యాన్ని ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది.దాంతో నెటిజనం రకరకాలుగా స్పందిస్తున్నారు.తక్షణం ప్రభుత్వం కల్పించుకొని వారికి సాయపడాలని, కళలను, కళాకారులకు అండదండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక ఈ విషయమై బాలీవుడ్( Bollywood ) నుండి కూడా కొంతమంది కళాకారులు తమ వంతుగా మద్దతు తెలియజేస్తున్నారు.ఇకపోతే గోరేగావ్ ఫిల్మ్ సిటీలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు.
గతంలో కూడా అనేక సంఘటనలు జరిగిన దాఖలాలు వున్నాయి.ఎందుకంటే అక్కడ చుట్టుతా అటవీ ప్రాంతం ఉండడంతో ఇలాంటి క్రూరమృగాలు సంచరిస్తూ ఉంటాయి.







