పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’( Bro The Avatar ) విడుదలకు సిద్ధం గా ఉన్న సంగతి తెలిసిందే.ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ఈ సినిమాని విడుదల చెయ్యబోతున్నారు మేకర్స్.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ మరియు టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ వారం లోనే ఈ సినిమాకి సంబంధించిన మొట్టమొదటి లిరికల్ వీడియో సాంగ్ కూడా విడుదల అవ్వబోతుంది.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి మామూలు రేంజ్ డిమాండ్ లేదు.అందులోనూ టీజర్ లో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్ మరియు కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోవడం తో ఇది మినిమం గ్యారంటీ సినిమా అని బయ్యర్స్ బలంగా నమ్ముతున్నారు.
అయితే ఈ సినిమా పూర్తి స్థాయి పవన్ కళ్యాణ్ సినిమా కాదు.
ఇందులో ఆయనతో పాటుగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కూడా నటిస్తున్నాడు.ఒక్కమాటలో చెప్పాలంటే ఇందులో పవన్ కళ్యాణ్ స్క్రీన్ టైం కేవలం 45 నుండి 50 వరకు ఉంటాడు.‘గోపాల గోపాల’ సినిమాలో ఎంతసేపు అయితే స్క్రీన్ మీద కనిపిస్తాడో, ఈ సినిమాలో కూడా అంతేసేపు కనిపిస్తాడు, అయినా కూడా ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కమర్షియల్ సినిమాల రేంజ్ లోనే బిజినెస్ జరుగుతుందట.అందులో కేవలం నైజాం ప్రాంతం కి సంబంధించిన రైట్స్ 36 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు టాక్.అలాగే ఆంధ్ర లో 45 కోట్ల రేషియో మరియు సీడెడ్ 13 కోట్ల రూపాయిల రేషియో లో ఈ సినిమా అమ్ముడుపోయినట్టు సమాచారం.
ఇది ఒక మామూలు క్లాస్ సినిమాకి, పైగా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి పాత్ర పోషించని సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ జరగడం అభిమానులకు సైతం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది.
మొత్తం మీద ఓవరాల్ గా ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి వంద కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టు సమాచారం.గత నెల 16 వ తారీఖున విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ ( Adipurush ) చిత్రానికి ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.అదంటే 400 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఆ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం లో అర్థం ఉంది.
కానీ బ్రో సినిమా ని తక్కువ బడ్జెట్ తో కేవలం పవన్ కళ్యాణ్ పేరు మీద ఇంత బిజినెస్ చేస్తున్నారు.చూడాలి మరి కమర్షియల్ గా ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది.
ఇక ఈ సినిమా కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈసారి ఆంధ్ర ప్రదేశ్ లోని రాజముండ్రి ప్రాంతం లో జరగబోతున్నట్టు తెలుస్తుంది.