ఐఎస్కేపీ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల విచారణలో కీలక అంశాలు బయటకు వచ్చాయి.ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్న సుమేరా భానును గుజరాత్ ఏటీఎస్ అధికారులు విచారిస్తున్నారు.
ఇటీవల సుమేరా భాను మాడ్యుల్ సభ్యులు గుజరాత్ ఏటీఎస్ కు దొరికిపోయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆ సభ్యులకు టోలిచౌక్ కి చెందిన ఖతిజా ఆన్ లైన్ లో టచ్ లోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ఖతిజాతో కలిసి హైదరాబాద్ లో కుట్ర చేసేందుకు స్కెచ్ వేసినట్లు విచారణలో వెల్లడైంది.పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ లో ఇస్లామిక్ రాజ్య స్థాపనే వీరి లక్ష్యమని ఏటీఎస్ అధికారులు తెలిపారు.