బారసాల వేడుకకు వచ్చిన అతిథులకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిన మెగాస్టార్?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఇంట్లో ప్రస్తుతం సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది.మెగా ప్రిన్సెస్ రాకతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.

 Megastar Gave Amazing Return Gifts To The Guests, Upasana, Chiranjeevi, Klin Kaa-TeluguStop.com

ఇక జూన్ 20వ తేదీ ఉపాసన( Upasana ) ఆడబిడ్డకు జన్మనివ్వడంతో శుక్రవారం మెగా ప్రిన్సెస్ కు బారసాల వేడుకను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈ బారసాల వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు.

ఇక ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరయ్యారని తెలుస్తుంది.ఈ వేడుకలో భాగంగా మెగా ప్రిన్సెస్ పేరును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

Telugu Chiranjeevi, Klinkaara, Ram Charan, Upasana-Movie

ప్రస్తుతం మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా కొణిదల( Klin Kaara Konidela ) బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలు అలాగే తన పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఇక ఈ పేరును లలితా సహస్రనామాల నుంచి ఎంపిక చేసాము అంటూ ఉపాసన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇకపోతే మెగా ప్రిన్సెస్ బారసాల వేడుక కోసం వచ్చినటువంటి ఆప్తుల కోసం మెగాస్టార్ ఖరీదైన అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్స్( Return Gifts ) ఇచ్చారని తెలుస్తోంది.మరి చిరంజీవి ఇచ్చిన ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి అనే విషయానికి వస్తే.

Telugu Chiranjeevi, Klinkaara, Ram Charan, Upasana-Movie

తమ మనవరాలు బారసాల వేడుక కోసం వచ్చినటువంటి మహిళల కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంతో విలువైన రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారట.ఈ రిటర్న్ గిఫ్ట్స్ లో భాగంగా పసుపు కుంకుమలతో పాటు పట్టుచీర, గాజులు, అలాగే గోల్డ్ కాయిన్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ గా ఇచ్చారని ఇండస్ట్రీ సమాచారం.ఇక తమ కుటుంబంలోకి మూడో తరం వారసురాలుగా మెగా ప్రిన్సెస్ రామ్ చరణ్ ( Ramcharan )ఉపాసనలకు వివాహం జరిగిన 11 సంవత్సరాలకు అడుగుపెట్టడంతో తనకు సంబంధించిన ఏ చిన్న వేడుక అయిన చాలా ఘనంగా జరగాలని మెగా ఫ్యామిలీ నిర్ణయం తీసుకున్నారని అందుకే బారసాల వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube