బారసాల వేడుకకు వచ్చిన అతిథులకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిన మెగాస్టార్?
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఇంట్లో ప్రస్తుతం సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది.మెగా ప్రిన్సెస్ రాకతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇక జూన్ 20వ తేదీ ఉపాసన( Upasana ) ఆడబిడ్డకు జన్మనివ్వడంతో శుక్రవారం మెగా ప్రిన్సెస్ కు బారసాల వేడుకను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.
ఇలా ఈ బారసాల వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు.ఇక ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరయ్యారని తెలుస్తుంది.
ఈ వేడుకలో భాగంగా మెగా ప్రిన్సెస్ పేరును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
"""/" /
ప్రస్తుతం మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా కొణిదల( Klin Kaara Konidela ) బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలు అలాగే తన పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఇక ఈ పేరును లలితా సహస్రనామాల నుంచి ఎంపిక చేసాము అంటూ ఉపాసన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఇకపోతే మెగా ప్రిన్సెస్ బారసాల వేడుక కోసం వచ్చినటువంటి ఆప్తుల కోసం మెగాస్టార్ ఖరీదైన అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్స్( Return Gifts ) ఇచ్చారని తెలుస్తోంది.
మరి చిరంజీవి ఇచ్చిన ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి అనే విషయానికి వస్తే.
"""/" /
తమ మనవరాలు బారసాల వేడుక కోసం వచ్చినటువంటి మహిళల కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంతో విలువైన రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారట.
ఈ రిటర్న్ గిఫ్ట్స్ లో భాగంగా పసుపు కుంకుమలతో పాటు పట్టుచీర, గాజులు, అలాగే గోల్డ్ కాయిన్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ గా ఇచ్చారని ఇండస్ట్రీ సమాచారం.
ఇక తమ కుటుంబంలోకి మూడో తరం వారసురాలుగా మెగా ప్రిన్సెస్ రామ్ చరణ్ ( Ramcharan )ఉపాసనలకు వివాహం జరిగిన 11 సంవత్సరాలకు అడుగుపెట్టడంతో తనకు సంబంధించిన ఏ చిన్న వేడుక అయిన చాలా ఘనంగా జరగాలని మెగా ఫ్యామిలీ నిర్ణయం తీసుకున్నారని అందుకే బారసాల వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారని తెలుస్తుంది.
కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ