బాలయ్య ఇంటికి ఆర్పీ చేపల పులుసు.... అసలు విషయం చెప్పిన ఆర్పీ!

బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కిరాక్ ఆర్పీ( Kiraak RP ) ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు( Nellore Peddareddy chepala pulusu ) రెస్టారెంట్ బిజినెస్ ను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.ఇలా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టినటువంటి ఈయన హైదరాబాద్లో పలు ఏరియాలలో చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభించారు.

 Rp Fish Soup For Balayya's House , Kiraak Rp, Chiranjeevi, Prabhas, Balakrishna-TeluguStop.com

అలాగే ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలలో తన బ్రాంచ్ లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఇలా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినటువంటి ఆర్పి పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యారని తెలుస్తోంది.

Telugu Balakrishna, Chiranjeevi, Kiraak Rp, Prabhas-Movie

ఇక ఈయన అనంతపూర్ లో రెండు, వైజాగ్ లో, ఇంకా బెంగుళూర్ లో ఇప్పుడు మియాపూర్ క్రాస్ రోడ్స్ లోను ఆర్పీ తన చేపల పులుసు బ్రాండ్ ని స్ప్రెడ్ చేసాడు.తాజాగా మియాపూర్ క్రాస్ రాడ్స్ లో మరొక బ్రాంచ్ ఏర్పాటు చేశారు ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా బలగం వేణు( Balagam Venu ) , ఇంకా హీరో అశ్విన్ ( Aswin )లు ఈ ఓపెనింగ్ లో పాల్గొన్నారు. ఇకపోతే ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బాలయ్య( Balayya ) ఇంటికి వెళ్లిందని ఆర్ పి ఈ సందర్భంగా తెలియజేశారు.

Telugu Balakrishna, Chiranjeevi, Kiraak Rp, Prabhas-Movie

ఈ సందర్భంగా ఆర్పీమాట్లాడుతూ గతంలో తాను మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ప్రభాస్ (Prabhas) వంటి వారికి తన చేపలు పులుసును పంపించానని తెలిపారు.అయితే మాదాపూర్ బ్రాంచ్ కి బాలకృష్ణ ఇంటి నుండి కొంతమంది వచ్చి చేపల పులుసు అడిగారని.అప్పటివరకు తనకి వచ్చినవాళ్లు బాలకృష్ణ మనుషులు అనే విషయం తెలియదని తెలిపారు.

అయితే చివరికి వారు బాలయ్య ఇంటి నుంచి వచ్చారనీ తెలిసిందని తెలిపారు.అయితే తన చేపల పులుసు రుచి బాగుంటేనే బాలయ్య ఇంటి నుంచి వారు చేపల పులుసు కోసం అక్కడికి వచ్చి పట్టుకెళ్లారని ఈ సందర్భంగా ఆర్పీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube