తెలుగు ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాజీ భార్య అయినా రేణు దేశాయ్( Renu Desai ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవన్ కళ్యాణ్ భార్యగా ఈమె మనందరికీ సుపరిచితమే.
తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు తన పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అలాగే సోషల్ మీడియాలో తన గురించి నెగటివ్ గా కామెంట్స్ చేసే వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ ఉంటుంది రేణు దేశాయ్.
నిత్యం సోషల్ మీడియాలో ఏదో రకమైన పోస్టులు చేస్తూనే ఉంటుంది.
![Telugu Bad, Pawan Kalyan, Pawankalyan, Renu Desai, Tollywood-Movie Telugu Bad, Pawan Kalyan, Pawankalyan, Renu Desai, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/07/bad-injuries-to-renu-desai-and-pawan-kalyan-fans-reactions-detailsd.jpg)
ఈ నేపథ్యంలోని తాజాగా మరో పోస్ట్ ని కూడా చేసింది రేణు దేశాయ్.కాగా రేణు దేశాయ్ గాయాలు అయిన విషయం అందరికీ తెలిసిందే.అయితే తనకు బలమైన గాయాలు తగిలాయి అని ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేసింది రేణు దేశాయ్.
నా కుడి పాదానికి చాలా పెద్ద గాయం అయ్యింది.మూడు వేళ్లు నలిగిపోయాయి.ఒక వేలిగోరు బయటకు వచ్చేసింది.కానీ అంత బాధలోనూ నేను సముద్రాన్ని ఆస్వాదిస్తున్నాను అంటూ సముద్రపు అలల్ని ఆస్వాదిస్తూ ఒంటరిగా ఉన్న వీడియోను షేర్ చేసింది రేణు దేశాయ్.
అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని కూడా జత చేసింది.కాగా సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ఎటువంటి పోస్ట్ పెట్టిన రేణు దేశాయ్ పేరు వినిపించిన ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ ప్రస్తావనను కొంతమంది లాక్కొస్తూ ఉంటారు.
![Telugu Bad, Pawan Kalyan, Pawankalyan, Renu Desai, Tollywood-Movie Telugu Bad, Pawan Kalyan, Pawankalyan, Renu Desai, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/07/bad-injuries-to-renu-desai-and-pawan-kalyan-fans-reactions-detailsa.jpg)
ఇక రేణు దేశాయ్ చేసిన పోస్ట్ పై పవన్ హేటర్స్ స్పందిస్తూ.వాడేమో ఇంకో పెళ్లి చేసుకుని సరదాగా జీవితం గడిపేస్తున్నాడు.వాడిని నమ్ముకున్న మీరు మాత్రం ఇలా ఒంటరిగా భరిస్తున్నారు అంటూ కామెంట్ చేశారు.ఈ కామెంట్‌పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ.వాడు వీడు ఏంటి బే.వదిలేయడం కంటే వెళ్లగొట్టడమే బెటర్‌లే మీ వెర్షన్‌లో.అయినా ఇక్కడ వాళ్ల పర్సనల్ మ్యాటర్ అవసరమా? వాళ్ల మధ్య బాగానే అండర్ స్టాండింగ్ ఉంది.మీరెందుకు బాధపడుతున్నారు.
ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌పై పడి ఏడ్వడమేనా? అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.పవన్ కళ్యాణ్ ని వాడు వీడు అన్నందుకు పవన్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.