ఏపీలో ఎన్నికల హడావిడి గట్టిగా కనిపిస్తోంది.ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికి ప్రధాన పార్టీలు ఇప్పుడే ఎన్నికలు అన్నంతగా హడావిడి చేస్తున్నాయి.
ముఖ్యంగా అధికార వైసీపీ( YCP ) వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని గట్టి పట్టుదలగా ఉంది.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్షా అని ప్రజలే వైసీపీని గెలిపిస్తారని వైఎస్ జగన్( CM Jagan ) ధీమాగా ఉన్నారు.
అంతే కాకుండా ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.దాంతో అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తున్నారు వైఎస్ జగన్.
ఎమ్మెల్యేల పని తీరు బాగలేకపోయిన, ప్రజా ప్రతినిధులపై వ్యతిరేకత ఉన్నా.పద్దతి మార్చుకోవాలని ఖరాకండి చెప్పేస్తున్నారాయన.
ఇప్పటికే 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలకు గట్టిగానే వార్నింగ్ లు కూడా ఇచ్చారు.ప్రజల్లో యాక్టివ్ లేని, వ్యతిరేకత ఉన్న నేతలకు ప్రజా మెప్పు పొందేలా పద్దతి మార్చుకోవాలని, లేని పక్షంలో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేని తేల్చి చెబుతున్నారు.దాంతో టికెట్ల విషయంలో ,లీడింగ్ ఎమ్మెల్యేలతో పాటు, ప్రస్తుత మంత్రులు, మాజీ మంత్రులలో కూడా ఆందోళన మొదలైందట.కొంతమందిపై వారి సొంత నియోజిక వర్గాలలోనే ప్రజల నుంచి గట్టిగా వ్యతిరేకత విస్తోంది.
బుగ్గన రాజేంద్ర నాథ్, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వంటివారికి గడప గడపకు మన ప్రభుత్వం ప్రజల్లో వారిపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా బయటపడింది.
ఈ లిస్ట్ లో కొడాలి నాని( Kodali Nani ) కూడా ఉన్నారు.వీరికి వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు కూడా ఇచ్చారు.అయితే వీరంతా ఇప్పటికీ కూడా ప్రజల్లో ఉండడానికి నిర్లక్ష్యం చూపుతూనే ఉన్నారు.
దీంతో వీరికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉంటుందా లేదా అనేది చెప్పలేని పరిస్థితి.ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేసిన జగన్.
టికెట్ల విషయంలో వీరికి మొండి చేయి చూపించిన ఆశ్చర్యాం లేదనేది కొందరి మాట.ఇక చాలమంది సిట్టింగ్ ఎమ్మేల్యేలు కూడా టికెట్లు దక్కుతాయో లేదో అనే డైలమా లోనే ఉన్నారట.ఇప్పటికే కోతమంది నేతలు టీడీపీతో టచ్ లో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.మరి టికెట్ల కేటాయింపులో ప్రజాధరణ లేకపోతే ఎలాంటి నాయకుడైన డోంట్ కేర్ అంటున్న జగన్.
ఎన్నికల సమయానికి కేటాయింపు ఎలా చేపడతారో అనేది ఆసక్తికరంగా మారింది.