విజయవాడ స్టేట్ కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులను విజయవాడ పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నలుగురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరంతా స్వప్రయోజనాల కోసం దాడులు చేస్తున్నట్లు గుర్తించారు.దాంతో పాటు పైళ్లను మూసివేయడానికి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, పన్ను ఎగవేత దారుల నుంచి అధికారులు లంచాలు కూడా తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలోనే జరిమానా విధించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని పోలీసులు తెలిపారు.నిందితులను సాయంత్రం విజయవాడ కోర్టులో హాజరుపర్చనున్నారు.