విజయవాడ పార్లమెంట్ సభ్యుడు తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాని ( Keshineni Nani )వ్యవహారం టీడీపీని కలవర పెడుతోంది.గత కొన్నాళ్లుగా ఆయన పార్టీకి అంటి అంతనట్టుగా ఉంటూ వస్తున్నారు.
ఆ మద్య టీడీపీ పై పరోక్షంగా విమర్శలు చేయడం, చంద్రబాబుపై కూడా అసంతృప్తిని వెళ్లగక్కడం వంటివి చేస్తూ వచ్చారు కేశినేని నాని.దాంతో ఆయన టీడీపీ( TDP ) వీడే అవకాశాలు ఉన్నాయని గట్టిగా వార్తలు వినిపించాయి.
అయితే తాను పార్టీ మారడం పై ఆ మద్య క్లారిటీ ఇచ్చిన నాని.తాను టీడీపీతోనే ఉంటానని తేల్చి చెప్పారు.
దాంతో ఈ వార్తలన్నీకి చెక్ పడినట్లైంది.అయితే ఈ మద్య ఆయన వైసీపీ ఎమ్మెలతో క్లోజ్ గా ఉంటూ వస్తున్నారు.
![Telugu Ap Poltics, Kesineni Nani, Tdp Chandrababu-Politics Telugu Ap Poltics, Kesineni Nani, Tdp Chandrababu-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/05/Keshine-Nani-is-making-TDP-a-messa.jpg)
ఇటీవల నందిగామ( Nandigama ) ఎమ్మెల్యేతో కలిసి కనిపించించిన నాని.తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ( MLA Vasantha Krishna Prasad )తో కలిసి కనిపించారు.ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో గుబుల్ పుట్టిస్తున్నాయి.తనకు పార్టీ టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయిన ఏ సమస్య లేదని.ప్రజలు కోరుకుంటే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కూడా సిద్దమే అని వివరణ ఇచ్చారు.దీంతో ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారనే వార్తలకు ఊతం ఇచ్చినట్లైంది.
అయితే నేతలతో క్లోజ్ గా ఉండడంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.రాజకీయాల్లో ఎవరికి ఎవరు శత్రువులు ఉండరని చెప్పిన ఆయన వైసీపీకి జగన్, టీడీపీ చంద్రబాబు ఇద్దరు మాత్రమే నాయకులని.
వారిద్దరే విరోధులు అని ఇంకెవరు లేరంటూ హాట్ కామెంట్స్ చేశారు.
![Telugu Ap Poltics, Kesineni Nani, Tdp Chandrababu-Politics Telugu Ap Poltics, Kesineni Nani, Tdp Chandrababu-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/05/Keshine-Nani-is-making-TDP-a-messb.jpg)
దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.అయితే నాని వైసీపీలో చేరతారని అందుకే ఆయన వైసీపీ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉంటున్నారని కొందరి మాట.ఒకవేళ నాని టీడీపీ వీడి వైసీపీ గూటికి చేరితే తెలుగుదేశం పార్టీకి గట్టిదెబ్బే తగిలే అవకాశం ఉంది.అయితే అసంతృప్తిగా ఉన్న నాని పై చంద్రబాబు బుజ్జగింపు చర్యలు చేస్తూనే ఉన్నారు.కానీ నాని మాత్రం టీడీపీకి దూరంగా ఉన్నన్నే సంకేతాలను ఇస్తున్నారు.ఒకవేళ ఎన్నికల సమయానికి ఆయన పార్టీ మారితే విజయవాడ ఎంపీ సీటు ఈసారి టీడీపీ ఎవరికి కేటాయిస్తుందో అనేది చూడాలి.ఒకవేళ వైసీపీలోకి వెళితే కేశినేని నానికి జగన్ ఎలాంటి ప్రదాన్యత ఇస్తారనేది కూడా ఆసక్తికరమే.
మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్ అయింది.