సూర్యాపేట జిల్లా: ఎస్.డి.
ఎఫ్ నిధుల నుండి కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ కలిసి విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీ అభివృద్ధికి, కోదాడ పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధికి మరియు నియోజకవర్గ పరిధిలోని పంచాయతీరాజ్,ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణానికి,పలు అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారని తెలిపారు.
అలాగే నియోజకవర్గంలోని పలు సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు.