టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సంయుక్త మీనన్( Samyukta Menon ) పేరు ఎక్కువగా వినిపిస్తోంది.27 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ బ్యూటీ నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి హిట్ అయ్యాయి.ఈ సినిమాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి.అభినయ ప్రధాన పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్న ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.
అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు( Tollywood Heroes ) మాత్రం సంయుక్త మీనన్ కు సినిమా ఆఫర్లు ఇవ్వడం లేదు.ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో డెవిల్ ( Devil ) ఉండగా కొత్త ప్రాజెక్ట్ ల గురించి సైతం ఆమె ప్రకటించడం లేదనే సంగతి తెలిసిందే.
అయితే సంయుక్త మీనన్ ను నిర్మాతలు సైతం పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.ఇప్పటికే ఆమెకు ఛాన్స్ ఇచ్చిన నిర్మాతలు సైతం ఆమెకు మళ్లీ ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదని బోగట్టా.
గోల్డెన్ లెగ్ అని సంయుక్త మీనన్ గురించి అందరూ కామెంట్లు చేస్తున్నా శ్రీలీల తరహాలో ఈ బ్యూటీ ఆఫర్లను అయితే సొంతం చేసుకోలేకపోతున్నారు.గోల్డెన్ లెగ్ అని పిలిపించుకుంటున్న సంయుక్తకు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎవరూ కూడా సెకండ్ హీరోయిన్ గా సైతం సంయుక్త పేరును పరిశీలించడం లేదు.
డెవిల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే సంయుక్త మీనన్ కెరీర్ పుంజుకుంటుందేమో చూడాల్సి ఉంది.ఆఫర్ల విషయంలో మాత్రం ఈ బ్యూటీ తడబడుతుండటం ఫ్యాన్స్ ను సైతం బాధ పెడుతోంది.ఈ కామెంట్ల గురించి సంయుక్త మీనన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.
సినిమా సినిమాకు సంయుక్త మీనన్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.