మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్( Samyukta Menon ) పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే.అంతకు ముందే సంయుక్త పలు సినిమా లలో నటించి మంచి విజయాలను సొంతం చేసుకుంది.
అయితే తెలుగు లో ఈ అమ్మడి కి ఆశించిన సక్సెస్ వస్తుందా లేదా అనే అనుమానాలు మొదట వ్యక్తం అయ్యాయి.చిత్రంలో పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్ర లభించింది.
అయినా కూడా ముద్దుగుమ్మ కు గుర్తింపు బాగానే వచ్చింది.బింబిసార సినిమా తో హీరోయిన్ స్థాయిలో సంయుక్త మీనన్ గుర్తింపు సొంతం చేసుకోవడంతో వెంటనే తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ దక్కాయి.
బింబిసారా( Bimbisara ) సినిమా సక్సెస్ కావడం తో లక్కీ బ్యూటీ అంటూ సంయుక్త ను అభినందించడం మొదలు పెట్టారు.ఆకట్టుకునే రూపం మంచి ఫిజిక్ నటన లో మంచి ప్రావీణ్యం ఉన్న ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ యొక్క అందాల ఆరబోత విషయం లో కూడా ఏమాత్రం తగ్గకుండా ముందే ఉంటుంది.
అందుకే ఈ ముద్దుగుమ్మ యొక్క సినిమాలు పెరుగుతూనే ఉన్నాయి.
ఈమె నటిస్తున్న ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్న కారణంగా ఈమెది గోల్డెన్ లెగ్ అంటూ ముద్ర పడిపోయింది.ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్ కాన్సెప్ట్ లను తాను నమ్మను అంటూ కామెంట్ చేసిన సంయుక్త మీనన్ తాజాగా నటించిన విరూపాక్ష( Virupaksha ) చిత్రం సక్సెస్ అవ్వడంతో నమ్మిన నమ్మకున్న సంయుక్త ది గోల్డెన్ లెగ్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.ఆకట్టుకునే రూపం ఉంటే సరిపోదు.
అదృష్టం కూడా ఉండాలి అని ఎంతో మంది విషయంలో మీరు నిరూపితమైనది.సంయుక్త మీనన్ కి అదృష్టం కావలసినంత ఉంది.
అందుకనే విరూపాక్ష చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ సినిమా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.చాలా కాలం తర్వాత సాయి ధరంతేజ్ కి సక్సెస్ దక్కింది అంటే అది సంయుక్త మీనన్ వల్లే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సంయుక్త టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని సినిమాల కమిట్ అయ్యే అవకాశం ఉంది.అంతే కాకుండా భారీగా తన రెమ్యూనరేషన్ పెంచే అవకాశాలు కూడా లేకపోలేదు.