ఎమ్మెల్యే రమేష్ బాబు ఆదేశాలతో అనుపురం గ్రామంలో ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం మద్దతు ధర పొందాలని రైతులకు సూచన! రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని వేములవాడ అర్బన్ జెడ్పిటిసి మ్యాకల రవి కొనియాడారు.నాంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు ఆదేశాల మేరకు అనుపురం గ్రామంలోని సబ్ సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించారు.
ఆరుగలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వరి ధాన్యాన్ని విక్రయించుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని తెలిపారు.
దళారులకు ధాన్యాన్ని విక్రయించి రైతులు నష్టపోకూడదని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.గత ప్రభుత్వాల హయాంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అన్ని విధాల ఆదుకుంటు రైతు పక్షపాతిగా కెసిఆర్ నిలిచారన్నారు.పంటలకు గిట్టుబాటు ధర రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కల్పిస్తుందని రైతులకు వివరించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు, స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, ఫ్యాక్స్ చైర్మన్ బి, రెడ్డి సల్మాన్ రెడ్డి, వైస్ చైర్మన్ శీలం రామచంద్రారెడ్డి, సొసైటీ డైరెక్టర్లు మాజీ ప్రజా ప్రతినిధులు వార్డు సభ్యులు రైతులు పాల్గొన్నారు.







