తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.బండి సంజయ్ అరెస్ట్ ను ఖండించిన ఆయన అరెస్ట్ కారణాన్ని వెల్లడించడంలో పోలీసులు విఫలం అయ్యారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తరుణ్ చుగ్ విమర్శించారు.కేసీఆర్ ఏ వ్యవస్థను గౌరవించడం లేదని మండిపడ్డారు.
కేసీఆర్ తను చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకుంటారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.