చిరుతపులులు, బ్లాక్ పాంథర్లు(Black panther) రెండూ ఒంటరి జంతువులుగా తిరుగుతుంటాయి.అవి సాధారణంగా ఒంటరిగా జీవిస్తాయి, ఒంటరిగానే వేటాడతాయి.
సంభోగం సమయంలో మాత్రమే ఇవి రెండుగా కనిపిస్తుంటాయి.కాగా తాజాగా ఒక అరుదైన వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది.
ఈ వీడియోలో ఒక చిరుతపులి, ఒక నల్ల చిరుతపులి అడవిలో కలిసి తిరుగుతూ కనిపించాయి.
ఈ వీడియో దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో(Karnataka) ఉన్న కబిని ఫారెస్ట్ రిజర్వ్‌లో(Kabini forest reserve) రికార్డ్ చేశారు.ఈ రిజర్వ్ విస్తారమైన అటవీ ప్రాంతం, నిటారుగా ఉన్న లోయలు, నీటి వనరులతో చాలా పెద్దగా ఉంటుంది.ఇందులో ఒక పెద్ద సరస్సు, దాని చుట్టూ పచ్చని చెట్లు, ఏనుగులు, పులులు ఉంటాయి.
ఈ అడవిలో చిరుతపులి, నల్ల చిరుతపులి(leopard) కలిసి కనిపించాయి.ఈ దృశ్యం కనిపించడం చాలా అరుదు.
అవి రెండూ కౄర మాంసాహారులు, తరచూ ఒకే వేట కోసం పోటీపడతాయి, కాబట్టి అవి ఈ విధంగా సహకరించడం అసాధారణం.
ఈ రెండు జంతువులు ఎందుకు కలిసి ఉన్నాయో స్పష్టంగా తెలియదు, కానీ అవి కలిసి వేటాడడం లేదా ఒకే భూభాగాన్ని పంచుకోవడం సాధ్యమే.కారణం ఏమైనప్పటికీ, ఈ అంతుచిక్కని, రహస్యమైన జంతువుల ప్రవర్తనపై వెలుగునిచ్చే వీడియో వైరల్ అయింది.22 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో రెండు చిరుతలు కలిసి నడుస్తూ వెళ్తున్నాయి.కెమెరా వైపు అవి చాలా అద్భుతంగా ఒక లుక్ కూడా ఇచ్చాయి.అద్భుతమైన వీడియోకి ఇప్పటికే 60 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.