చిన్నారి రేవతి నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగిన సంగతి మనందరికీ తెలిసిందే.నాలుగేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించిన సమయంలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన తల్లి చిన్నారిని ఒడిలో పెట్టుకుని పవన్ దగ్గరికి తీసుకువచ్చి పుట్టుకతోనే అతి భయంకరమైన మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో జన్మించిందని రేవతి అడుగు కూడా నడవలేని స్థితిలో ఉండేదని.
అంతటి అనారోగ్య సమస్యతో పోరాడుతున్న ఆ చిన్నారికి పవన్ ను సాయం చేయమని అడగగా అప్పుడు పవన్ కళ్యాణ్ ఆ బాలికను దగ్గరికి తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకుని కాసేపు మాట్లాడిన సంగతి తెలిసిందే.
అప్పుడు ఆ బాలిక పరిస్థితి తెలుసుకొని చలించిపోయిన పవన్ కళ్యాణ్ వెంటనే ఆ బాలికకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు.వ్యాధి కారణంగా నరాలు ఒక్కొక్కటిగా చచ్చుబడిపోతూ జీవచ్ఛవంలా మారుతున్న ఆ పాపకు ఎలక్ట్రిక్ వీల్ చైర్ కూడా అందించారు.కొన్నాళ్లుగా అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో తాజాగా ఆ చిన్నారి మరణించింది.
ఆ పాప మరణం తనను తీవ్రంగా కలచివేసిందని భావోద్వేగ ట్వీట్ చేశారు.పాపం మరణం పై స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ విధంగా రాసుకొచ్చారు.
నాలుగేళ్ల కిందట ఎస్.రేవతి అనే చిన్నారి నన్ను కలిసింది.మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధితో జన్మించిన ఈ చిన్నారి అనారోగ్య స్థితిలో కూడా చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటూ చూపిన ధైర్యం నన్ను అబ్బురపరచింది.
భగవద్గీత లోని 750 శ్లోకాలను కంఠస్థం చేసిందని తెలిసి చాలా ఆనందించాను.అయితే తనకున్న వ్యాధి కారణంగా ఈ చిన్నారి మూడు రోజుల కిందట 12 ఏళ్లకే శివైక్యం చెందడం చాలా బాధాకరం.ఈ విషయం నా మనసును తీవ్రంగా కలచివేసింది.
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.అయితే పుట్టినప్పుడే ఆమె ఎక్కువ కాలం బ్రతకడం కష్టం అని డాక్టర్లు చెప్పినప్పటికీ 12 ఏళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న రేవతి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.