ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది.ఈ క్రమంలో తొమ్మిది మంది అభ్యర్థులను సీఎం జగన్ ఫైనల్ చేశారు.
ఈ మేరకు అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు.
అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని సజ్జల తెలిపారు.
తొలి నుంచి పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.కాగా మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా… వీటిలో 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
వైసీపీ అభ్యర్థులుగా సత్తు రామారావు ( శ్రీకాకుళం), కుడుపూడి సూర్యనారాయణ (తూర్పుగోదావరి), వంకా రవీంద్రనాథ్ ( పశ్చిమ గోదావరి), కవురు శ్రీనివాస్ ( పశ్చిమ గోదావరి), మంగమ్మ ( అనంతపురం), మేరుగ మురళీధర్ (నెల్లూరు), డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు), పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (కడప), డాక్టర్ మధుసూదన్ (కర్నూలు) పేర్లను సజ్జల ప్రకటించారు.