పెళ్లి సందడి సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకు పోతుంది.రవితేజ హీరో గా నటించిన ధమాకా సినిమా తో సక్సెస్ సొంతం చేసుకున్న శ్రీ లీల ఇప్పటికే మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా లో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయింది.
అంతే కాకుండా నందమూరి బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా లో శ్రీ లీల కీలక పాత్రలో కనిపించబోతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ కు కూతురు పాత్ర లో శ్రీ లీల కనిపించబోతుందని వార్తలు వస్తున్నాయి.
ఒక వైపు కమర్షియల్ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుండగా మరో వైపు ఇలా సెకండ్ హీరోయిన్ పాత్రల్లో మరియు హీరో కు కూతురు పాత్రలో నటించడం ఎంత వరకు కరెక్ట్ అని ఆమె అభిమానులు కొందరు ప్రశ్నిస్తున్నారు.
హీరోయిన్ గా స్టార్ హీరో ల సినిమాలను కమిట్ అవ్వకుండా అనవసరంగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలను కమిట్ అవుతుందని కొందరు విమర్శిస్తున్నారు.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా శ్రీ లీల మంచి పాత్ర లో నటించి హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంటే రాబోయే 10 సంవత్సరాల పాటు ఈమె స్టార్ హీరోయిన్ గా కొనసాగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ శ్రీ లీల మాత్రం ఇలా తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటుందని, సీనియర్ స్టార్ హీరోలకు ఓకే చెప్పి తన యొక్క ఇమేజ్ ని తగ్గించుకుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ బాబు మరియు బాలకృష్ణ సినిమాలు శ్రీ లీల యొక్క కెరియర్ ని ఎటు వైపుకు తీసుకెళ్తాయో చూడాలి.