టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ, పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డేకు ఈమధ్య అంతగా కలిసి రావట్లేదు.వరుస ఫ్లాప్ లతో ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా తెచ్చుకొని బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.
అందం పరంగా దర్శక నిర్మాతలను మెప్పించినప్పటికీ కూడా ఈ బ్యూటీ కి ఈ మధ్య మాత్రం అదృష్టం దురదృష్టంగా మారింది.అయితే తాజాగా మరో కొత్త సినిమా అంటూ తెలపగా ఈసారి కూడా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.
పూజా తొలిసారిగా 2010 లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.ఆ తరువాత వరుస సినిమాలలో వెను తిరిగి చూడకుండా అవకాశాలు అందుకొని మంచి సక్సెస్ లు సొంతం చేసుకుంది.అలా తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.ఈమధ్య వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా దూసుకుపోతుంది.కానీ ఎటువంటి లాభం లేకపోయింది.
ఒకప్పుడు పూజ హెగ్డే అంటే టాలీవుడ్ దర్శక నిర్మాతలు బాగా సెంటిమెంటుగా భావించేవాళ్ళు. ముందుగానే తన డేట్స్ కోసం బాగా ఎగబడేవారు.
తనకు డేట్స్ లేకున్నా కూడా తనకోసం ఎదురు చూసేవాళ్ళు.కానీ ఇప్పుడు అలా లేదు.
ఇక ఈ బ్యూటీ ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటుంది.అంతేకాకుండా అభిమానులతో కూడా బాగా ముచ్చట్లు పెడుతుంది.మరింత ఫిజిక్ కోసం బాగా ప్రయత్నిస్తుంది.తెగ వర్క్ అవుట్ లు చేస్తూ బిజీగా మారింది.ఇక తను వర్క్ అవుట్ లు చేస్తున్న ఫోటోలను కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే మొన్నటి వరకు ఫ్లాప్స్ అందుకున్న ఈ బ్యూటీకి బాగా ట్రోల్స్ ఎదురయ్యాయి.ఐరన్ లెగ్ అంటూ బాగా ట్రోల్స్ చేశారు.
ఇక ఇండస్ట్రీలో నీ పని అయిపోయింది అంటూ కామెంట్లు కూడా పెట్టారు.అయినా కూడా పూజ హెగ్డే వీటిని పట్టించుకోకుండా తన లైఫ్ ఏంటో తాను చూసుకుంటుంది.
అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.
అందులో తను మేకప్ వేయించుకుంటున్నట్లు కనిపించగా.ఆ ఫోటోకి కొత్త సినిమా కొత్త లుక్ అంటూ తెలిపింది.దీంతో నెటిజన్స్ మరోసారి తనను టార్గెట్ చేశారు.
ఈసారి ఏ హీరోను బుక్ చేస్తున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఎందుకంటే ఇప్పటికే ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధే శ్యామ్ తో పాటు మరికొన్ని సినిమాలలో నటించి ఆ సినిమాలో నటించిన హీరోలను నిరాశపరిచింది.
దీంతో ఇప్పుడు ఏ హీరోతో నటిస్తున్నావు.ఇక ఆ హీరో పని అయిపోయినట్టే అంటూ బాగా కామెంట్లు పెడుతున్నారు.