చిలగడదుంప.దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.దుంపల్లో రుచికరమైనది.అందుకే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది చిలగడదుంపను ఎంతో ఇష్టంగా తింటుంటారు.చిలకడదంపను ఉడికించి కొందరు నేరుగా తీసుకుంటారు.మరికొందరు చిలకడదుంపతో రకరకాల వంటలు చేస్తుంటారు.
చిలకడదంపతో ఏ వంటకం చేసినా రుచి అదిరిపోతుంది.అలాగే చిలగడ దుంపలో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.
అవి మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అలాగే చిలగడదుంప చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతాయి.
ముఖ్యంగా క్లియర్ స్కిన్ ను అందించడానికి చిలగడదుంప గ్రేట్ గా సహాయపడుతుంది.
మరి ఇంతకీ చర్మానికి చిలకడదుంపను ఎలా ఉపయోగించాలి అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక చిలగడదుంపని తీసుకుని నీటిలో ఉడికించి తొక్క తొలగించాలి.ఇలా పీల్ తొలగించిన చిలగడదుంపను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడిని వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, రెండు టేబుల్ స్పూన్లు గ్రైండ్ చేసి పెట్టుకున్న చిలగడదుంప మిశ్రమం వేసుకోవాలి.చివరిగా సరిపడా పచ్చి పాలు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త అందంగా అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.
అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి చిలకడదుంపతో ఈ రెమెడీని పాటిస్తే చర్మంపై మచ్చలు మొటిమలు తొలగిపోతాయి.స్కిన్ క్లియర్ అండ్ గ్లోయింగ్ గా మారుతుంది.మరియు అధిక జిడ్డు తొలగిపోయి చర్మం ఫ్రెష్ గా మారుతుంది.కాబట్టి క్లియర్ స్కిన్ ను పొందాలని ఆరాటపడుతున్న వారు తప్పకుండా చిలగడ దుంపతో పైన చెప్పిన రెమెడీని పాటించండి.అందంగా మెరిసిపోండి.