ఇప్పుడు బాలీవుడ్ మొత్తం పఠాన్ మ్యానియాతో ఊగిపోతోంది.ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ దాహంతో ఉంది.
మరి అలాంటి సమయంలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుంది.వారం రోజుల్లోనే 700 కోట్ల రూపాయలను వసూళ్లు చేసి బాలీవుడ్ కు పూర్వవైభవం తీసుకు వచ్చారు.
మరి దీనికి కారణం ఎవరంటే ఈ సినిమా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.
ఈయన డైరెక్షన్ కారణంగానే షారుఖ్ ఐదేళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఈయన మొదటి నుండి యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అనే చెప్పాలి.మరి పఠాన్ వంటి సూపర్ హిట్ తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అంచనాలు భారీగా పెరిగాయి.
మరి సిద్ధార్థ్ ఆనంద్ ప్రెజెంట్ హృతిక్ రోషన్ తో ఫైటర్ సినిమా చేస్తున్నాడు.ఆ తర్వాత ప్రభాస్ తో భారీ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నట్టు ఇప్పటికే కథనాలు వెలువడ్డాయి.
ఇది కన్ఫర్మ్ అని మైత్రి మూవీస్ అధినేత క్లారిటీ ఇచ్చారు.అయితే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు హృతిక్ కూడా ఉంటారని టాక్ వస్తుంది.మరి తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.ఈ బడా ప్రాజెక్ట్ దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్టు టాక్ వస్తుంది.ఇదే నిజమైతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలిసారి ఇంత భారీ బడ్జెట్ సినిమా రానుంది.
అయితే సిద్ధార్థ్ ఆనంద్ ఇంత భారీ బడ్జెట్ ను హ్యాండిల్ చేయగలరా లేదా అనే సందేహం చాలా మందిలో నెలకొంది.ఇప్పటి వరకు ఈయన 500 కోట్ల బడ్జెట్ వరకు మాత్రమే తెరకెక్కించాడు.కానీ ఇప్పుడు 1500 కోట్లు అంటే ఎలా మ్యానేజ్ చేస్తాడా అనేది చూడాలి.
మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకువెళుతుందో చూడాలి.ఇద్దరు కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
అవి పూర్తి అయితే కానీ ఈ సినిమా స్టార్ట్ కాదు.