బ్రిటన్ రాణి ఎలిజబెత్-II మరణం తరువాత ఆస్ట్రేలియా ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది.ఇప్పుడు ఆస్ట్రేలియాలోని ఐదు డాలర్ల కరెన్సీ నోట్‌పై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగించాలని భావిస్తోంది.
ఆస్ట్రేలియా తమ స్వదేశీ సంస్కృతి చరిత్రను ప్రతిబింబించేలా కొత్త కరెన్సీ నోటును తీసుకు రానుంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా విడుదల చేసిన ప్రకటన ద్వారా ఈ విషయం వెల్లడైంది.
ఫెడరల్ ప్రభుత్వాన్ని సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.నోట్ మరొక వైపు, ఆస్ట్రేలియా పార్లమెంట్ చిత్రం అలాగే ఉంటుందని స్పష్టం చేసింది.
బ్రిటన్ రాణి లేదా రాజు చిత్రం దాదాపు 8 దేశాల కరెన్సీలో ఉంటుంది.ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్వదేశీ నినాదం ఎత్తుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సెప్టెంబర్ 2022లో క్వీన్ ఎలిజబెత్ మృతి చెందారు.ఆ తర్వాత కింగ్ చార్లెస్‌కు రాజు హోదా వచ్చింది.మామూలుగా అయితే రాణి ఉన్న నోట్ల స్థానంలో రాజు చిత్రాన్ని ముద్రించాలని భావిస్తారు.ఈ తరుణంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.5 డాలర్లపై ఒక వైపు ఉండే బ్రిటన్ రాణి ఉన్న నోట్ల స్థానంలో స్వదేశీ సంస్కృతిని తెలియజేసేలా కొత్త చిత్రం రానుందని సంకేతాలిచ్చింది. 5 డాలర్ల నోట్‌పై రాణి చిత్రాన్ని చేర్చాలనే నిర్ణయం ఆమె వ్యక్తిత్వాన్ని చూపించాలనే ఆలోచనతో జరిగింది.
కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా యొక్క సెంటర్-లెఫ్ట్ లేబర్ ప్రభుత్వం అక్కడ రాజ్యాంగంలో మార్పులు చేయాలని ఆలోచిస్తోంది.అక్కడి కరెన్సీ, ఇతర విషయాలలో స్వదేశీ ప్రజల ఆకాంక్షలను గుర్తించాలని భావిస్తోంది.అంతకుముందు 2021 లో, ఆస్ట్రేలియా దేశంలోని జాతీయ గీతాన్ని అధికారికంగా సవరించింది.తద్వారా అక్కడి దేశీయ ప్రజలు ప్రపంచంలోని పురాతన నాగరికత గురించి మరింత సమాచారం పొందవచ్చు.
అదే సమయంలో యువత, ఇతరులలో స్వేచ్ఛ యొక్క అనుభూతిని కూడా పెంచవచ్చు.