సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి కష్టపడి పైకి ఎదిగి హీరోగా స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న వారు ఎంతోమంది ఉన్నారు.అటువంటి వారిలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా ఒకరు.
కాగా గత ఏడాది భూల్ భులయ్యా 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ సినిమా బాలీవుడ్‌లో ఒక్కసారిగా సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయాడు.
అయితే, ఇటీవల కార్తీక్ ఆర్యన్ పారితోషికం విషయం గురించి వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
మొదటి సినిమాకు రూ.1.75 లక్షలు పారితోషికం తీసుకున్న కార్తిక్ ఆర్యన్.తాజాగా ఓ సినిమాలో 10 రోజులు నటించినందుకు ఏకంగా రూ.20కోట్లు తీసుకున్నాడనే వార్త వైరల్‌గా మారింది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ ఆర్యన్ పారితోషికం విషయంపై స్పందిస్తూ.నేను కరోనా సమయంలో నటించిన సినిమాకు రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న మాట నిజమే.నేను ఆ సినిమాను 10 రోజుల్లోనే పూర్తిచేశాను.
దీని వల్ల నిర్మాతలకు ఎంతో లాభం వచ్చింది.కాబట్టి నేను ఆ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అని చెప్పుకొచ్చాడు కార్తిక్ ఆర్యన్.
అంటే రోజుకు రెండు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నాడు అంటూ వస్తున్న వార్తలను నిజమని చెప్పకనే చెప్పేసాడు.దీంతో ఈ యంగ్ హీరో క్రేజ్ చూసి అభిమానులు నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు.ఇకపోతే ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్, అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు.కాగా హీరో కార్తిక్ ఆర్యన్ కు బాలీవుడ్ తో టాలీవుడ్ కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.