దైవభక్తి అనేది సామాన్యులకే కాకుండా ఒక హోదాలో ఉన్న వాళ్ళకి కూడా ఉంటుందన్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన హీరోలకు కూడా దైవభక్తి ఉంటుంది.
తమ సినిమాల విషయాలలో హీరోలు మంచి రోజును, మంచి ముహూర్తాన్ని చూసుకుంటూ ఉంటారు.అంతేకాకుండా అప్పుడప్పుడు తమలో ఉన్న భక్తిని కూడా బయట పెడుతూ ఉంటారు.
ఈ మధ్య హీరోలు చాలావరకు దేవుడు మాలలు వేస్తూ కనిపిస్తున్నారు.ఇప్పటికే రామ్ చరణ్, నాని ఇలా పలువురు హీరోలు అయ్యప్ప మాల ధరించిన సంగతి తెలిసిందే.
తాజాగా హీరో నితిన్ కూడా శ్రీ ఆంజనేయ మాల ధరించి తనలో ఉన్న భక్తిని బయట పెట్టాడు.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుల లేరని చెప్పాలి.
తన నటనతో మంచి మార్కులు సంపాదించుకున్న ఇతడు చాలావరకు లవ్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.లవ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో మంచి హిట్ ను సాధించుకున్నాడు.
నితిన్ తొలిసారిగా 2002లో జయం సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టగ ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు అందించింది.
ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించిన నితిన్ కు ఉత్తమ నటుడుగా గుర్తింపు వచ్చింది.అయితే గత కొన్ని రోజుల నుండి నితిన్ ఖాతాలో సక్సెస్ అనేది లేకుండా పోయింది.నిజానికి టాలీవుడ్ లో ఈయన ఈ మధ్య చాలా తక్కువ సినిమాలలో కనిపిస్తున్నాడు.
ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లిన ఈయన ఇప్పుడు కేవలం చాలా గ్యాప్ తో ఒక్క సినిమాతోనే వస్తున్నాడు.వచ్చిన సినిమాలతో కూడా అంత సక్సెస్ కాలేకపోతున్నాడు నితిన్.
ఇక ఆ మధ్య మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు.
కానీ ఈ సినిమా కూడా పూర్తి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆయన అభిమానులు బాగా నిరాశ చెందారు.దీంతో ఆయన సక్సెస్ కోసం బాగా ఎదురు చూస్తున్నాడు.
పైగా ఎంచుకునే కథలు విషయంలో కూడా బాగా జాగ్రత్త పడుతున్నాడు.
నితిన్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటాడు.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆయన తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో పంచుకున్నాడు.
ఇక అందులో ఆయన శ్రీ ఆంజనేయ మాల ధరించినట్లు కనిపించాడు.ఇక ఆ ఫోటో షేర్ చేస్తూ.శ్రీ ఆంజనేయం.శర్వదా జయం. ఎంజాయ్ యువర్ ఆదివారం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.ఇక ఈ ఫోటో చూసిన కొందరు శ్రీ ఆంజనేయం అనగా చేయగా మరి కొంతమంది మంచి సక్సెస్ కోసం దేవుడు మాల ధరించాడేమో అని అనుమానం పడుతున్నారు.
ఏదైతే ఏంటి.ఆయనలో ఉన్న దైవభక్తి ఈ విధంగా బయటపడిందని కొందరు అంటున్నారు.