ఈ మధ్య కాలంలో ఎందరో పురుషులు బట్టతల కారణంగా తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.తలలో ఇన్ఫెక్షన్స్, హార్మోనుల్లో మార్పులు, అనీమియా, ఆహారపు అలవాట్లు, పలు రకాల మందుల వాడకం, థైరాయిడ్, అధిక ఒత్తిడి, డ్రగ్స్ తీసుకోవడం, ధూమపానం, మద్యపానం, ఏజింగ్ ఇలా రకరకాల కారణాల వల్ల బట్టతల సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.
బట్టతలతో బాధ పడే వారు మళ్లీ నెత్తిపై జుట్టును పెంచుకునేందుకు నానా ప్రయత్నిస్తుంటారు.
అయితే అలాంటి వారికి బీర్ బెస్ట్ అప్షన్‌గా చెప్పుకోవచ్చు.
అవును, బట్టతలను నివారించడంలో బీర్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి బీర్‌ను తలకు ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు బీర్ వేసుకుని..
అందులో ఒక ఎగ్ వైట్ మరియు రెండు స్పూన్ల ఆముదం వేసకుని బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.
ఇరవై నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.ఇలా వారానికి ఒక సారి చేస్తే బట్టతలపై క్రమంగా కొత్త జుట్టు వస్తుంది.
అలాగే ఒక బౌల్‌లో అర కప్పు బీర్, రెండు స్పూన్ల ఉల్లి పాయ పేస్ట్, రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.
అర గంట పాటు వదిలేయాలి.ఆ తర్వాత కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూ యూజ్ చేసి హెడ్ బాత్ చేయాలి.
ఇలా ఐదు రోజులకు ఒక సారి చేసినా మంచి ఫలితం ఉంటుంది.
ఇక హెయిర్ ఫాల్‌ను నివారించడంలోనూ బీర్ ఉపయోగపడుతుంది.ఒక గిన్నెలో ఒక కప్పు బీర్, రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు మొదళ్ల నుంచి చివర్లకు వరకు పట్టించాలి.
ముప్పై నిమిషాల అనంతరం తల స్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గి.
జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.