పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందనా ఆ మధ్య నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది అంటూ ప్రచారం జరిగింది.సౌత్ తో పాటు నార్త్ లో కూడా వరుసగా ఆఫర్స్ వస్తుండడంతో తన యొక్క క్రేజ్ అమాంతం పెరిగిందని, ఎంత పారితోషికం డిమాండ్ చేసినా కూడా నిర్మాతలు ఇస్తారని భావించిన రష్మిక ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పారితోషకం డిమాండ్ చేస్తూ వచ్చింది.
హీరోయిన్ గా తనకున్న పాపులారిటీనికి తగ్గట్టుగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేసిన రష్మిక కి అవకాశాలు తగ్గాయి.గత ఆరు నెలలుగా రష్మిక కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు.పారితోషికం అంత భారీ గా పెంచితే ఏ ఒక్కరు కూడా అవకాశం ఇవ్వరని కాస్త ఆలస్యంగా గుర్తించిన ఈ అమ్మడు ఎట్టకేలకు తన రెమ్యూనరేషన్ తగ్గించినట్లుగా తెలుస్తోంది.
నితిన్ హీరో గా వెంకీ కుడుముల దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా లో రష్మిక మందన హీరోయిన్ గా ఎంపిక అయింది.
గతం లో వీరు ముగ్గురు కలిసి భీష్మ సినిమా చేయడం జరిగింది.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం తో మరో సారి ఈ ముగ్గురు జత కట్టబోతున్నారు.
నితిన్ తో కలిసి నటించేందుకు గాను రష్మిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని ఆసక్తికర ప్రచారం జరుగుతుంది.
నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన రష్మిక ఇప్పుడు రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కి నితిన్ తో నటించేందుకు ఓకే చెప్పింది అంటూ వార్తలు వస్తున్నాయి.రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుని సినిమా లు చేస్తే ఈ శ్రీవల్లి కి కచ్చితంగా మరిన్ని ఆఫర్స్ వస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.