మన భారతదేశానికి చాలా దేశాలతో సరిహద్దులు ఉన్నాయి.వాటిలో కొన్ని దేశాలు భారతదేశంతో సరిహద్దుల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవకు దిగుతూ ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే చైనాతో భారత్కు ముప్పు పొంచి ఉన్న ఈ సమయంలో అరుణాచల్ ప్రదేశ్ లో రహదారులు, వంతెనలు, సొరంగాల మార్గాలను భారత్ శరవేగంగా నిర్మాణం చేస్తుంది.అతి శీతల వాతావరణ పరిస్థితులు ఎదురైనా సరిహద్దులకు వేగంగా సైనిక బలగాలను తరలించేందుకు వీలుగా వీటిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మిస్తుంది.
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ప్రాంతాన్ని డిబేట్ లో భాగమని వాదిస్తున్న చైనా పదేపదే చొరబాట్లకు ప్రయత్నిస్తున్న తెలిసిందే.
చైనా ఎలాంటి దుస్సహాసానికి పాల్పడిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భారీ ఎత్తున సైన్యాన్ని మొహరించిన భారత్ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని వేగవంతం చేసింది.
పర్వతాలతో నిండిన ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో చలి వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది.ఎంత చలి వాతావరణ పరిస్థితులు ఎదురైనా సంవత్సరం పొడుగునా రాకపోకలు సాగేలా ఆ రోడ్లు సొరంగాలు, వంతెనలు నిర్మిస్తూ ఉంది భారత్.
అందువల్ల అదనపు బలగాలను శరవేగంగా అక్కడికి పంపించేందుకు వీలు ఉండేలా చేసుకుంటుంది.
![Telugu Roads, China, Tunnels, Counter Chinese, India, Indiachinal, India China, Telugu Roads, China, Tunnels, Counter Chinese, India, Indiachinal, India China,](https://telugustop.com/wp-content/uploads/2022/12/india-constructing-tunnels-roads-to-counter-chinese-invasion-detailss.jpg )
ఇక్కడి భూభాగం చాలా క్లిష్టంతరంగా ఉండే అవకాశం ఉంది.పర్వతాలు ఎక్కువగా ఉండటం, ఇంకా చెప్పాలంటే సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఇక్కడ భూభాగం ఉంది.పర్వతాలు వాతావరణ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి.
ఇలాంటి కఠిన వాతావరణ పరిస్థితులలో రోడ్డు నిర్మాణం కోసం సరిహద్దు రహదారుల సంస్థ నిరంతరం పనిచేస్తోంది.ఇక్కడికొన్ని గ్రామాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి.
అలాంటి మారు మూల ప్రాంతాలకు కూడా మేము రోడ్లు వేయిస్తున్నామని చీఫ్ ఇంజనీర్ చెబుతున్నారు.అరుణాచల్ ప్రదేశ్ లోనీ చైనాతో సరిహద్దు కలిగిన అన్ని గ్రామాలకు రోడ్లతో అనుసంధానించబోతున్నట్లు చెబుతున్నారు.
చలికాలంలో రోడ్లు మంచుతో కప్పు కు పోయే చోట్ల సొరంగ మార్గాలను కూడా నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.