తెలంగాణలో బయటపడిన నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఒడిశా నుంచి తెలంగాణకు నకిలీ మద్యం సరఫరా చేసినట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది.ఇటీవలే ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి సుమారు రూ.3 కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు.
ఒడిశాలోని కటక్ లో నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని అధికారులు కనుగొన్నారు.అనంతరం రూ.1.20 కోట్ల విలువైన 20 వేల లీటర్ల నకిలీ విస్కీని సీజ్ చేశారు.ఒడిశాలో తయారు చేసి తెలంగాణ బ్రాండ్ పేరుతో మద్యం విక్రయాలు సాగుతున్నట్లు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే తెలంగాణ నకిలీ టేబుల్ షీట్లు, తయారీ సామాగ్రితో పాటు భారీగా నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా ఈ కేసులో ఇప్పటికే 26 మందిని టీఎస్ ఎక్సైజ్ శాఖ అరెస్ట్ చేయగా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.నకిలీ మద్యం కేసులో శివారెడ్డి, బాలరాజు గౌడ్ తో పాటు సంజయ్ అనే వ్యక్తిని కీలక నిందితులుగా అధికారులు నిర్ధారించారు.
ఆగస్ట్ నుంచి ఈ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు.