సీబీఐ విచారణకు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు హాజరయ్యారు.ఢిల్లీలో అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు అందించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నోటీసులతో గంగుల, రవిచంద్రలు ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.కాగా శ్రీనివాస్ తో ఉన్న సంబంధాలు, లావాదేవీలపై వాంగ్మూలం నమోదు చేయనున్నారు అధికారులు.
ఫేక్ ఆఫీసర్ ముసుగులో డబ్బు ఎర చూపి శ్రీనివాస్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రలోభ పెడుతున్నట్లు సీబీఐ గుర్తించింది.ఈ మేరకు విచారణను వేగవంతంగా కొనసాగిస్తోంది.