టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ ప్రస్తుతం ఊహించని స్థాయిలో ఆఫర్లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.స్టార్ హీరోలు కొత్తగా ఏ ప్రాజెక్ట్ ను ప్రకటించినా ఆ సినిమాకు థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేయడానికి ప్రాధాన్యత ఇస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన మణిశర్మ థమన్ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఒక టాక్ షోలో మణిశర్మ మాట్లాడుతూ థమన్ ను నేను చేతికి ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుతో కొట్టేవాడినని అన్నారు.
తన దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ కూడా ఒకరని మణిశర్మ తెలిపారు.కొంతకాలం పాటు థమన్ నా దగ్గర కీ బోర్డ్ ప్లేయర్ గా కెరీర్ ను కొనసాగించాడని మణిశర్మ చెప్పుకొచ్చారు.
నాకు కోపం చాలా ఎక్కువగా ఉండేదని ఆయన వెల్లడించడం గమనార్హం.
వరుసగా పెద్ద హీరోల సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో ట్యూన్స్ తో పాటు బీజీఎం బాధ్యత కూడా నాపై ఉండేదని మణిశర్మ అన్నారు.
ఆ సమయంలో థమన్ చేసిన పనుల వల్ల కోపం వస్తే చేతికి ఏది దొరికితే దానితో థమన్ ను కొట్టేవాడినని ఆయన వెల్లడించారు.నా దెబ్బలకు భయపడి థమన్ మానిటర్ వెనుక దాక్కున్న సందర్భాలు సైతం ఉన్నాయని మణిశర్మ పేర్కొన్నారు.

నా కోపం తాత్కాలిక కోపం అని కొంత సమయం తర్వాత నా కోపం సాధారణంగా తగ్గిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.ఓర్పు, ఓపికతో థమన్ నా దగ్గర మ్యూజిక్ నేర్చుకుని ఊహించని స్థాయికి ఎదిగాడని మణిశర్మ కామెంట్లు చేశారు.మణిశర్మ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి.