సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలు కష్టపడుతుంటే అసలు చూడలేదు.వారికి ఏమాత్రం అసౌకర్యం కలిగినా ఓర్చుకోలేరు.
తమకు సాధ్యమైనంతవరకు వారికి హెల్ప్ చేసి వారి జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చుతుంటారు.తమ కష్టాన్ని దాచిపెట్టి తమ పిల్లల్లో సంతోషాన్ని పెంచుతుంటారు.
ఇక తల్లి ప్రేమ తండ్రి కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది.వీరు తమ పిల్లలను అన్ని కష్ట సమయాల్లో అక్కున చేర్చుకుంటారు.
కాగా తాజాగా ఒక తల్లి తన చిన్నారి వర్షంలో తడవకుండా, కాళ్లకు ఒక్క వాన చుక్క కూడా తగలకుండా తన భుజాలపై ఎత్తుకొని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళింది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఆ అమ్మ ప్రేమకు నెటిజన్ల హృదయాలు కరిగిపోతున్నాయి.వారు బాగా ఎమోషనల్ అయిపోతూ తల్లి ప్రేమ అంటే ఏంటో మరోసారి చూపించారమ్మా అని ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
జిందగీ గుల్జార్ హై ట్విట్టర్ అకౌంట్ ఈ వీడియోను షేర్ చేసింది.దీనికి లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.18 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఒక తల్లి స్కూల్ యూనిఫారంలో ఉన్న తన పిల్లని భుజాలపై మోసుకుంటూ వెళ్లడం చూడవచ్చు.ఆమె తన బిడ్డకు గొడుగు కూడా పట్టుకుంది.
తన బిడ్డకు ఒక్క వాన చినుకు కూడా తగలకుండా తీసుకెళ్తూ ఎంతో సంతోషంగా ఆమె కనిపించింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు తల్లి ఎప్పటికైనా తల్లి ఆమె ప్రేమకు మరే ఇతరుల ప్రేమ సాటి రాదు అని ఎమోషనల్ కామెంట్లు చేస్తున్నారు.
ఈ హార్ట్ టచింగ్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.