Employees Office Useful Things: ఉద్యోగులకు ఆఫీసులో ఉపయోగపడే వస్తువులు ఇవే

వర్క్ ఫ్రం హోం నుంచి ఇప్పుడిప్పుడే అంతా ఆఫీసులకు వెళ్తున్నారు.అయితే ఇంటిలో ఉండే సౌకర్యాలు ఆఫీసులో ఉండకపోవచ్చు.ఉద్యోగులు రోజులో ఎక్కువ సమయం గడిపే ప్రదేశం ఆఫీసు.మీరు నిశితంగా పరిశీలిస్తే, మీరు వారానికి 40 గంటలు అంటే మీ కార్యాలయంలో సమయం గడుపుతారు.ఆఫీసులో అందరికీ అనువైన సౌకర్యాలు ఉండకపోయినా, మార్కెట్‌లో లభించే యాక్సెసరీస్‌తో, మీరు మీ ఆఫీస్ స్పేస్‌ను చాలా ఆనందదాయకంగా మార్చుకోవచ్చు.అలాంటి కొన్ని ప్రొడక్టుల గురించి తెలుసుకుందాం.

 These Are The Items That Are Useful For Employees In The Office Details,employee-TeluguStop.com

ఇంట్లో సరైన సమయపాలన లేకుండా పని చేసి ఉంటాం.అయితే ఆఫీసులో అలా కుదరదు.

ఇందుకు పరిష్కారంగా కౌంట్ డౌన్ టైమర్‌ను వాడుకోవచ్చు.మీరు పని చేసే డెస్క్ వద్ద దీనిని పెట్టుకోవాలి.ఏ సమయానికి ఏం చేసుకోవాలో ప్లాన్ చేసుకుని, ఆ పనికి తగ్గట్టు టైమ్ సెట్ చేసుకోవాలి.తద్వారా ఆఫీసుకు త్వరగా అలవాటు పడతాం.ఈ ప్రొడక్ట్ ప్రారంభ ధర రూ.500ల నుంచి మొదలవుతుంది.ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇలా అన్ని రకాల గ్యాడ్జెట్లకు ఉపయోగపడే పోర్టబుల్ పవర్ స్టేషన్‌ల వాడకం పెరిగింది.ఇల్లు, ఆఫీసులలో కూడా దీనిని బాగా వినియోగిస్తున్నారు.ఒక్కోసారి ఔట్ డోర్ వెళ్లినప్పుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.దీని ధర రూ.18 వేలకు నాణ్యమైనది లభిస్తుంది.ఆఫీసులో ఒక్కోసారి సీటుకు అతుక్కుపోతుంటారు.

Telugu Count, Employee, Employees, Gadgets, Latest, Seat, Ups-General-Telugu

అయితే పని చేస్తూ ఎక్సర్‌సైజ్ చేసేందుకు ఎలిప్టికల్ మెషీన్ అందుబాటులో ఉంది.దీని ద్వారా ఆఫీసులో పని చేస్తూనే, కసరత్తులు చేయొచ్చు.కుర్చీ కింద పెట్టుకుని, కాళ్లతో 8 రకాల కసరత్తులు చేయొచ్చు.రూ.27 వేలకు చక్కటి ఎలిప్టికల్ మెషీన్ మనకు దొరుకుతుంది.ఇక ఆఫీసులో ఉండే వారికి కుర్చీ తగిన ఎత్తులో ఉండకపోవడంతో అడ్జస్టింగ్ సమస్యలు ఉండవచ్చు.

అంతేకాకుండా వెన్నుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.వీటిని నివారించేందుకు సీట్ కుషన్ ఉపయోగపడుతుంది.రూ.1600లకు చక్కటి మెమొరీ ఫోమ్‌తో తయారు చేసినవి లభిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube