గాడిద పాలకు ఎన్నడూ లేని విధంగా డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే.అందుకే నాలుగు గాడిదలున్న వాళ్లను లక్షలాదికారులని ప్రజలు పరిగణిస్తున్నారు.
వీటి పాలు ఎంతో విలువైనవే అయినప్పటికీ గాడిదల ఆహారం ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.అందుకే దీనిని ఎక్కువమంది పెంచుకునేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు.
దానికి తోడు వీటిని కాస్త గారాబంగా పెంచుతున్నారు.ఎంత గారాబంగా అంటే వీటిని తమ భుజాలపై వేసుకొని మోస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ఇదే దృశ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.
ఈ వీడియోలో ఒక గాడిద ఒక వ్యక్తి వీపుపై దర్జాగా కూర్చుని ఉండటం గమనించవచ్చు.
అలాగే ఒక బస్సు, దాని రూఫ్‌టాప్ పైకి వేసిన ఒక నిచ్చెన కూడా చూడవచ్చు.ఆపై వీడియోలో ఆ వ్యక్తి ఈ గాడిదను మోస్తూ.మెల్లిగా నిచ్చెన ఎక్కుతూ బస్సుపైకి గాడిదను తీసుకెళ్లడం గమనించవచ్చు.ఈ దృశ్యం చూసే అందరూ అవాక్కవుతున్నారు.
సాధారణంగా గాడిదలపై మనుషులు ఎక్కుతారు కానీ ఇదేంటి ఇక్కడ మనిషి పై గాడిద ఎక్కింది అని బాగా నవ్వుకుంటున్నారు.ఈ ఫన్నీ ఘటన పాకిస్థాన్‌లోని బస్టాండ్‌లో జరిగినట్లు సమాచారం.
@HasnaZarooriHai యూజర్ నేమ్ గల ట్విట్టర్ ఈ వీడియోను షేర్ చేశారు.” గాడిదపై మనిషి సవారీ చేయడం మీరు చూశారు కానీ ఎప్పుడైనా మనిషి పైన గాడిద ఎక్కడం చూశారా?” అని ఈ వీడియో క్లిప్ కి ఒక క్యాప్షన్ జోడించారు.ఇది చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు.