జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే.చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్‌కు మోడీ అపాయింట్‌మెంట్ లభించడంతో హుటాహుటిన విశాఖను వెళ్ళిన పవన్ మోడీతో వివిధ అంశాలపై చర్చించారు.
అయితే ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చలోకి వచ్చాయో స్ఫష్టంగా తెలియనప్పటికీ జనసేన,బీజేపీ పోత్తులకు సంబందించిన పలు అంశాలపై చర్చినట్లు తెలుస్తోంది.ఏపీలో ఇటీవల పవన్ తీరును చూస్తే జనసేన,బీజేపీ మధ్య గ్యాప్ పెరిగినట్లుగా అనిపించింది.
అయితే ఆ గ్యాప్‌ను తగ్గించడానికి పవన్‌ను మోడీ భేటికి ఆహ్వనించారు.
దీంతో రెండు పార్టీల మధ్య గ్యాప్ లేదనే సంకేతాకాన్ని పంపినట్లు అయింది.
కాషాయ పార్టీతో పొత్తు కొనసాగించడంపై పవన్ ఆసక్తిగా లేరని, బదులుగా ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నేతలకు తెలియజేసినట్లు సమాచారం. తనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన దాడిపై బీజేపీ నేతలు గట్టిగా స్పందించకపోవడం, జనవాణి కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని ఒత్తిడి తెచ్చి హోటల్ నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంపై పవన్ విరుచుకుపడ్డారు.
మోడీ ఎలాగూ విశాఖకు వస్తున్నారు కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకుని పవర్ స్టార్‌ని ఒప్పించి బీజేపీతో బంధాన్ని బలపరచవచ్చని ఏపీ బీజేపీ నేతలు భావించారు.బీజేపీ పెద్దలతో మాట్లాడించడం ద్వారా పవన్ తన వైఖరిని మార్చుకోవచ్చని రాష్ట్ర నేతలు భావించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లుగా అర్ధమవుతుంది.గత నెలలో విజయవాడలో చంద్రబాబు నాయుడు.పవన్ కళ్యాణ్‌ను కలిసిన విషయం తెలిసిందే.ఈ సమయంలో టీడీపీ, జనసేన పోత్తు ఖరారు అయినట్లుగా చాలా మంది భావించారు.దీంతో అలర్ట్ బీజేపీ ఎలాగైన పవన్‌ను తమతో ఉంచుకోవాలని భావించిన మోడీతో పవన్ భేటీ అయ్యే విధంగా చేశారు.