టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే.తరచూ ఏదో ఒక వివాదంతో రాంగోపాల్ వర్మ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.
ఎవరో ఒకరిపై కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా వాఖ్యలు చేస్తూ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తలు నిలుస్తూనే ఉంటాడు.అంతేకాకుండా డైరెక్టర్ గా హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ దూసుకుపోతున్నారు.
ఎక్కువగా బోల్డ్ సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు ఆర్జీవి.ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త తెగ చెక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే రాంగోపాల్ వర్మ ఒక పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నారట.టాలీవుడ్ పాన్ ఇండియా హీరో నటిస్తున్న ఆ పాన్ ఇండియా సినిమాలో రామ్ గోపాల్ వర్మ నటించబోతున్నాడట.
ఆ పాన్ ఇండియా హీరో మరెవరో కాదు డార్లింగ్ ప్రభాస్.డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.
సలార్,ప్రాజెక్ట్ కే,స్పిరిట్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.దీంతోపాటుగా మారుతీ దర్శకత్వంలో మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

కాగా ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో చేస్తున్న ప్రాజెక్ట్ కె ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది.ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడట.ఇటీవలే నాగ్ అశ్విన్ ఈ మూవీలో ఓ పాత్ర కోసం రామ్ గోపాల్ వర్మ ని సంప్రదించగా.ఆయనకు కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
త్వరలోనే సినిమాలో ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.ఈ వార్త చెక్కర్లు కొట్టడంతో ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో నిలిచి ఎక్కువగా బోల్డ్ సినిమాలను తెరకెక్కించే ఆర్జీవి ఈ సినిమాలో ఎటువంటి పాత్రలో నటించబోతున్నాడు అని ఆసక్తి నెలకొంది.
ఈ విషయం పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.