గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు.రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పశ్చిమ రాయలసీమ అభ్యర్థిగా భూమి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, తూర్పు రాయలసీమకు కంచర్ల శ్రీకాంత్ పేర్లను ప్రకటించారు.
టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా పోరాడాలని నాయకులకు పిలుపునిచ్చారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు ఇతర ప్రజా సంఘాల నుండి మద్దతు వచ్చినా గాని ప్రధాన రాజకీయ పక్షాలు బరిలోకి దిగడంతో ఈ ఎలక్షన్స్ ప్రతిష్ఠిత్మకంగా మారాయి.ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చిలో ఖాళీగా ఉన్న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలలో ఎవరు గెలుస్తారు అన్నది ఉత్కంఠ భరితంగా మారింది.
ఈ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే ముందుగానే అధికార పార్టీ వైసీపీ అభ్యర్థులను ప్రకటించడం విశేషం.