పుష్ప 1 ది రైజ్ సెన్సేషనల్ హిట్ అవడంతో పుష్ప పార్ట్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాని ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగానే ప్లాన్ చేస్తున్నారట.
రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న పుష్ప 2 సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.ఇక పుష్ప 2 సినిమా కోసం సుకుమార్ కేవలం దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహిస్తున్నట్టు తెలుస్తుంది.
పుష్ప 1 కి నిర్మాణ భాగస్వామ్యం ఉన్న ముత్తంశెట్టిని పక్కన పెట్టి ఆ ప్లేస్ లో సుకుమార్ నిర్మాణంలో భాగమవుతున్నారట.
పుష్ప 2 సినిమా కోసం సుకుమార్ కూడా నిర్మాతగా మారడం సినిమాకు మరింత ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.
అయితే సుకుమార్ తన రెమ్యునరేషన్ ఏమి తీసుకోకుండా సినిమా నిర్మాణంలో సపోర్ట్ అందిస్తున్నారట.ఇలా చేయడం వల్ల సుకుమార్ కి పెద్ద మొత్తం లో లాభం ఉంటుందని తెలుస్తుంది.
తెలుస్తున్న సమాచారం ప్రకారం పుష్ప 2 కోసం సుకుమార్ 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడని టాక్. సుకుమార్ తో పాటుగా అల్లు అర్జున్ కూడా పుష్ప 2 కోసం భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.