ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అద్వాన పరిస్థితిలో ఉన్న సంగతి తెలిసిందే.రోడ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుబట్ల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత స్వరం వినిపిస్తుంది.
ఇదే సమయంలో ప్రతిపక్షాలు సైతం ఏపీలో రోడ్లు గురించి వైసిపి ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తూ ఉన్నాయి.రోడ్లపై ఉన్న గుంతల కారణంగా ప్రజలు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు.
ఇటువంటి తరుణంలో ఏపీలో రోడ్ల విస్తారనకు కేంద్రం నిధులు కేటాయింపు చేయడం జరిగింది.
రాష్ట్రంలో 22 రోడ్లను విస్తరించి కొత్త వాటిని నిర్మించేందుకు ఆమోదం లభించింది.
ఇందులో 13 జిల్లా రహదారులు, ఏడు రాష్ట్ర హైవేలు.రెండు ఇతర రోడ్లు ఉన్నాయి.
కేంద్ర రహదారుల మౌలిక వసతుల అభివృద్ధి నిధి (CRIF)నుండి రూ 540 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు విడుదలయ్యాయి.ఈ పరిణామంతో త్వరలోనే టెండర్లు పిలిచి.
ఏడాదిలోనే 319 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తుంది.