ఏపీలో పంచాయితీ ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్

ఏపీలో కొత్త సంవత్సరంతో మరో రాజకీయ ఎన్నికల వేది మొదలుకాబోతుంది.స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న మూడు పార్టీలకి ఎన్నికల నగారా మోగింది.

ఇక ఎన్నికల రణరంగంలో పార్టీలు తమ సత్తా చాటుకోవడానికి సిద్ధం కావడమే తరువాయి.పల్లెల్లో సంక్రాంతి సందడితో ఎన్నికల సంఘం ఎన్నికల సందడి కూడా తీసుకొచ్చింది.

జనవరిలోనే ఎన్నికలకి తెరతీసింది.ఈ మేరకు ఎన్నికల సంఘం జిల్లా అధికారులకి మార్గదర్శకాలు జారీ చేసింది.

డిసెంబరు 15 నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు.దీని తర్వాత జనవరి 10న రిజర్వేషన్ల జాబితా ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

అలాగే జనవరి 11 తేదీ నుంచి పంచాయితీ ఎన్నికల కోడ్‌ రాష్ట్రంలో అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ వెల్లడించారు.అలాగే పంచాయితీ ఎన్నికలలో వార్డు నెంబర్ కి తెలుపు రంగు బ్యాలెట్ పేపర్, సర్పంచ్ కి గులాబి రంగు బ్యాలెట్ పేపర్ సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఇక ఎన్నికల కమిషన్ స్పష్టమైన ప్రకటన చేయడంతో ఇక పంచాయితీ ఎన్నికలలో సత్తా చాటాలని అధికార పార్టీ వైసీపీ, ఈ ఎన్నికలతో తమ బలం తగ్గలేదని నిరూపించికోవాలని టీడీపీ, ఇక పంచాయితీ ఎన్నికల ద్వారా సంస్థాగతంగా బలం పెంచుకోవాలని జనసేన పార్టీలు తమ కార్యాచరణని సిద్ధం చేసుకునే పనిలో పడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు